స్టార్ హీరోల గుట్టు విప్పేస్తానంటోన్న షకీలా..

షకీలా .. పరిచయం అవసరం లేని నటి. దక్షిణ భారత చలన చిత్రాల్లో ఎక్కువుగా నటించిన.. ఆమెకు మళయాళ శృంగార చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

news18-telugu
Updated: May 17, 2019, 6:34 PM IST
స్టార్ హీరోల గుట్టు విప్పేస్తానంటోన్న షకీలా..
షకీలా, షకీలా సినిమాలో రిచా చడ్డా
  • Share this:
షకీలా .. పరిచయం అవసరం లేని నటి. దక్షిణ భారత చలన చిత్రాల్లో ఎక్కువుగా నటించిన.. మళయాళ శృంగార చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆమె శృంగార చిత్రాల్లో నటిస్తూ దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిగా పేరు తెచ్చుకుంది. అయితే.. షకీలా 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాలు చేసింది. అది అలా ఉంటే షకీలా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..  తాను అనుభవించిన దుర్భరమైన బాల్యాన్ని గురించి, పదహారేళ్ళ వయసులో తన వ్యభిచార జీవితాన్ని, అంతేకాకుండా తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎలా, ఎందుకు మారిందో తెలియజేసింది. తన శరీరాన్ని కేవలం శృంగారభరితంగా చూపటానికి ప్రయత్నించారు కాని.. తనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదని చెప్పుకున్నది.

షకీలా సినిమా పోస్టర్..Photo: Instagram.com/therichachadha
షకీలా సినిమా పోస్టర్..Photo: Instagram.com/therichachadha


ప్రస్తుతం షకీలా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. షకీలా నిజ జీవిత పాత్రలో రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఎక్కువ శృంగారభరిత సన్నివేశాలతో కాకుండా చిత్రీకరించాలని అనుకున్నారట కానీ ఇప్పుడు బోల్డ్‌గానే చూపించడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రిచా కూడా సై అన్నారు. దీంతో కావాల్సినంత బోల్డ్ కాంటెంట్‌కు ఈ సినిమాలో అవకాశం ఉండనుంది. మలయాళంలో ఒకప్పుడు షకీలా సినిమాలు చాల క్రేజ్, ఆమె సినిమాల ముందు తమ సినిమాలకు కనీసపు ఓపెనింగ్స్ అయినా వస్తాయా అని స్టార్ హీరోలు కూడా భయపడేవారు. అంతగా తన ప్రభావం మలయాళ చిత్ర పరిశ్రమపై ఉండేది. కానీ స్టార్ హీరోలు ఆమెను ఎదగకుండా చేశారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తన జీవితంలో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటనలు ఏవీ మిస్ కాకుండా తనకు అన్యాయం చేసిన వారి పేర్లతో సహా బయటపెట్టాలని నిర్ణయించుకుంది షకీలా. అందుకు తగ్గట్టుగానే షకీలా దగ్గరుండి తన కథను పర్యవేక్షించుకుంటుందట.

షకీలా సినిమా పోస్టర్..Photo: Instagram.com/therichachadha
షకీలా సినిమా పోస్టర్..Photo: Instagram.com/therichachadha
కొందరు మలయాళ ఇండస్ట్రీలో తన సినిమాలు నిషేధించి తన కెరీర్‌పై దెబ్బ కొట్టారని, తనకు మనుగడ లేకుండా చేసిన సూపర్ స్టార్స్ ప్రస్తావనను షకీలా ఈ బయోపిక్ చూపించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి తన జీవితంలోని కష్టాలు, తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటుపోట్లు, తన సినిమాలను నిషేధించి ఎలా తనను తొక్కేయాలని స్టార్ హీరోలు ప్రయత్నించిన తీరు.. మొదలగు అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారని చెప్పుకోచ్చింది షకీలా.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు