"మా" ఎలెక్ష‌న్ అయిపోయిన త‌రువాత మాట్లాడ‌తా : మోహ‌న్‌బాబు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మెహ‌న్ బాబు

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో.. సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు ఒక్కొక్క‌రుగా స్పందించారు. ప‌వ‌న్ వాఖ్య‌ల‌పై మోహ‌న్‌బాబు కూడా స్పందించారు. ఆయ‌న త‌న అభిప్రాయ‌న్ని ట్విట్ట‌ర్ ద్వార వెల్ల‌డించారు.

  • Share this:
    రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో.. సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు ఒక్కొక్క‌రుగా స్పందించారు. ప‌వ‌న్ వాఖ్య‌ల‌పై మోహ‌న్‌బాబు కూడా స్పందించారు. ఆయ‌న త‌న అభిప్రాయ‌న్ని ట్విట్ట‌ర్ ద్వార వెల్ల‌డించారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప‌వ‌న్ వాఖ్య‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు అయిపోతాయని మోహ‌న్ బాబు అన్నారు. ఆ తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడిగిన ప్రతీ మాటకు సమాధానం చెబుతానని మోహన్ బాబు లేఖ‌లో చెప్పుకొచ్చారు. చివ‌ర‌గా .నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణు బాబుకు..అతని ప్యానెల్ కి వేసి వాళ్లను గెలిపించాలని కోరుతున్నాను..థ్యాంక్యూ వెరీ మచ్ ..అంటూ లేఖ‌లో మోహ‌న్ బాబు పేర్కొన్నారు.



    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏమ‌న్నాడు..
    మోహన్ బాబు మా సోదరుడు .అంటూనే మీరు వైసీపీ నేతలకు బంధువులని చెప్పుకుంటారు కదా ఆన్ లైన్ టిక్కెట్ల పైన స్పందించండి. ఏపీ సీఎంకు చెప్పండి అంటూ పవన్ రిప‌బ్లిక్ ఆడియో ఫంక్ష‌న్‌లో అన్నారు. దీంతో పాటుగా మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో ఫీజులు కూడా ఆన్ లైన్ ద్వారా స్వీకరించాలని అని సూచించారు. దీనికి కౌంట‌ర్‌గా మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

    Andhra pradesh : ఏవిధంగా ఇబ్బంది పెట్టామో పవన్ క‌ల్యాణ్ చెప్పాలి : మంత్రి పేర్ని నాని



    నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు..నా కంటే చిన్న వాడివి అందుకని ఏకవచనంతో సంబోదించాను అని మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అనటంలో కూడా తప్పు లేదు. చాలా కాలానిని నెమ్మదిగా నన్ను లాగావ్..సంతోషం అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయని.. త‌న కుమారుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారని.. ఈ ఎన్నిక‌లు అయ్యాక మాట్లాడ‌తానని పేర్కొన్నారు.

    గ‌తంలోనూ..
    చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమా వజ్రోత్సవం వేడుకల సమయం నుంచి వీరిద్దరి మధ్య వివాదం సాగుతోంది. లెజండరీ ఎవరనే అంశం పైన అప్పట్లో మెగా బ్రదర్స్ అండ్ మోహన్ బాబు మధ్య వివాదం జరిగింది. ఆ త‌ర్వాత చాలా కాలం ఈ వివాదం కొన‌సాగింది. అయితే కొంత కాలాని అంతా స‌ర్దుకొని వివాదాలు స‌మ‌సిపోయాయి. అయితే తాజాగా మా ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంత గ్యాప్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ వాఖ్య‌లు మ‌రింత వివాదానికి కార‌ణం అయ్యాయని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వాఖ్యానిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published: