హోమ్ /వార్తలు /movies /

చిరంజీవి పక్కన అలాంటి పాత్ర మాత్రం అస్సలు చేయను.. రాధిక ఇంట్రస్టింగ్ కామెంట్స్

చిరంజీవి పక్కన అలాంటి పాత్ర మాత్రం అస్సలు చేయను.. రాధిక ఇంట్రస్టింగ్ కామెంట్స్

తెలుగు హీరోలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది రాధిక. రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానంది. చిరు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది రాధిక.

    చిరంజీవి, రాధిక హిట్ పెయిర్. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరూ కలిసి అనేక హిట్ సినిమాలు తీశారు. అప్పట్లో చిరు రాధిక జంట పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అందులో అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అయితే వీరిద్దరు మంచి స్నేహితులు కూడా... ప్రతీ ఏడాది మెగాస్టార్ ఇంట్లో జరిగే గెట్ టు గెదర్ పార్టీకి కూడా రాధిక మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారు. ఇక రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవితో పాటు అనేక హీరోలతో జతకట్టి ఆన్ స్క్రీన్ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్టీఆర్ , కృష్ణ , నాగేశ్వర్ రావు , చిరంజీవి , వెంకటేష్ తదితరాల హీరోలందరి పక్కన నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

    ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. దీంతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో రాధిక నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాధిక ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలుగు హీరోలపై అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ... ఆయన సెల్ఫ్ మేడ్ మాన్ అంటూ కితాబిచ్చింది రాధిక. తన కష్టంతో ఎదిగిన వ్యక్తి అని ప్రశంసించిది. ఇప్పటికీ చిరు అదే డెడికేషన్‌తో వర్క్‌ చేస్తున్నారని తెలిపింది.

    చిరు సినిమాల్లో ఏదైనా రోల్ వస్తే నటించేందుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నగా... ఎలాంటి పాత్ర అయినా చేస్తా కానీ... చిరంజీవి తల్లిగా అయితే అస్సలు చేయనని తెగేసి చెప్పింది రాధిక. ఇక మెగాస్టార్ సినిమాలో కావాలంటే విలన్‌గా అయినా చేస్తాను, ఎలాంటి పాత్రలు అయినా చేస్తాను కాని.. తల్లి పాత్ర మాత్రం చేయనంది. ఇయ టాలీవుడ్ యంగ్ హీరోలపై కూడా రాధిక మాట్లాడింది.తనకు తెలుగు హీరోలందరూ చాలా ఇష్టమని తెలిపింది. జూ. ఎన్టీఆర్‌కు ఫెంటాస్టిక్‌ ఎనర్జీ.. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిన్నతనం నుంచి తనకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది రాధిక.

    First published:

    ఉత్తమ కథలు