I WILL NOT MARRY ACTRESS NITHYA MENEN SHE WAS HEARTLESS A LETTER GOING VIRAL IN SOCIAL MEDIA PK
Nithya Menen: నిత్యా మీనన్‌ను చస్తే పెళ్లి చేసుకోను.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కుర్రాడి లెటర్..
నిత్యా మీనన్ (Nithya Menen)
Nithya Menen: సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్లు భలే వైరల్ అవుతుంటారు. విచిత్రమైన పనులు చేస్తూ.. కొన్ని భిన్నమైన పోస్టులు పెడుతూ తమకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంటారు. తెలుగులో ఉప్పల్ బాలు తరహా అన్నమాట.
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్లు భలే వైరల్ అవుతుంటారు. విచిత్రమైన పనులు చేస్తూ.. కొన్ని భిన్నమైన పోస్టులు పెడుతూ తమకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంటారు. తెలుగులో ఉప్పల్ బాలు తరహా అన్నమాట. అలాగే కేరళలోనూ ఒకడున్నాడు.. అతడి పేరు సంతోష్ ఆర్కీ. మనోడికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన చేసే క్రేజీ పనులు చూసి బాగానే నవ్వుకుంటారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిపోయాడు సంతోష్ ఆర్కీ. మోహన్ లాల్‌కి వీరాభిమాని అయిన సంతోష్ వర్కీ.. సినిమాలకు చిత్రమైన రివ్యూలు ఇస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా మనోడు ఇచ్చే రివ్యూలకు ట్రోలర్స్ పండగ చేసుకుంటారు. తాజాగా ఇప్పుడు సంతోష్ వర్కీ మరో ఫేస్బుక్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు. వర్కీ కొత్త పోస్ట్ నటి నిత్యా మీనన్ గురించి పెట్టాడు.
తనకు నిత్యా మీనన్ అంటే ఇష్టమని.. నటి ఇంటికి కూడా వెళ్లి పెళ్లికి ప్లాన్ చేశానని సంతోష్ గతంలో చెప్పాడు. ఇప్పుడు మరింత ముందుకెళ్లాడు మనోడు. ఈ సారి ఏకంగా నిత్యా మీనన్‌ను చస్తే పెళ్లి చేసుకోనని.. ఆమెకు హృదయం లేదంటూ లెటర్ రాసాడు. ఆమె ఏదో ఈయన కోసం వెయిట్ చేస్తున్నట్లు.. నిత్యా మీనన్ వచ్చి అడిగినా కూడా నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు సంతోష్. ఆమె మంచిదైతే కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇచ్చేది కదా అంటున్నాడు ఈయన.
ప్రస్తుతం నిత్యా మీనన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని.. ఆమె కోసం తన సమయాన్ని, శక్తిని వృధా చేయాలనుకోవడం లేదని చెప్పాడు సంతోష్. సినీ ప్రపంచం హృదయరహితమని, మోసం జరుగుతోందని వర్కీ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన నిజమైన ప్రేమను గుర్తించలేని నిత్య జీవితంలో కచ్చితంగా ఏదో ఓ సమయంలో పశ్చాత్తాపపడుతుందని.. ఆమెకు తనను పొందే అర్హత లేదంటూ మనోడు లేఖలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇదంతా ఆయన కామెడీ కోసమే చేసాడని అర్థమవుతుంది. లేదంటే నిత్యా మీనన్ లాంటి హీరోయిన్ వచ్చి ఈయన్ని పెళ్లి చేసుకోడానికి రావడం ఏంటి అంటున్నారు నెటిజన్లు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.