• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • I WILL ASK THAT QUESTION TO PRABHAS ALLU ARJUN ABOUT REBEL STAR MNJ

Prabhas- Allu Arjun: ప్ర‌భాస్ క‌నిపిస్తే అదే ప్ర‌శ్న అడుగుతా.. అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర స‌మాధానం

Prabhas- Allu Arjun: ప్ర‌భాస్ క‌నిపిస్తే అదే ప్ర‌శ్న అడుగుతా.. అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర స‌మాధానం

ప్ర‌భాస్ అల్లు అర్జున్

టాలీవుడ్‌లోని బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్(Allu Arjun), ప్ర‌భాస్(Prabhas) ఉంటారు. ఈ ఇద్ద‌రు సినిమాల్లోకి రాక‌ ముందు నుంచే మంచి ఫ్రెండ్స్‌. ఈ క్ర‌మంలో పార్టీలు కూడా చేసుకునేవారు.

  • Share this:
    Prabhas- Allu Arjun: టాలీవుడ్‌లోని బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్ర‌భాస్ ఉంటారు. ఈ ఇద్ద‌రు సినిమాల్లోకి రాక‌ ముందు నుంచే మంచి ఫ్రెండ్స్‌. ఈ క్ర‌మంలో పార్టీలు కూడా చేసుకునేవారు. అయితే సినిమాల్లోకి వ‌చ్చి.. కెరీర్‌లో బిజీగా మారారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌యం కుదుర్చుకుని అప్పుడప్పుడు వీరు క‌లుస్తూ ఉంటారు. ఆ స‌మ‌యంలో వీరు తీసుకున్న ఫొటోలు వైర‌ల్‌గా మార‌డంతో పాటు అభిమానులను కూడా బాగా ఆక‌ట్టుకునేవి. ఇదిలా ఉంటే ఓ ఇంట‌ర్వ్యూలో అల్లు అర్జున్‌కి ప్ర‌భాస్‌కి సంబంధించిన ఓ ప్ర‌శ్న ఎదురైంది.

    ప్ర‌భాస్ క‌నిపిస్తే మీరు ఏమ‌ని అడుగుతారు అన్న యాంక‌ర్ ప్ర‌శ్న‌కు.. నీ నెక్ట్స్ మూవీ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతాను అని ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పాడు. ఈ ఇంట‌ర్వ్యూ పాత‌దే అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కాగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్‌లో న‌టిస్తుండ‌గా.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

    ఈ మూవీ త‌రువాత నాగ్ అశ్విన్, ఓమ్ రౌత్, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో ప‌నిచేయ‌నున్నారు ప్ర‌భాస్. వీటిలో నాగ్ అశ్విన్, ఓమ్ రౌత్ మూవీలు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. మ‌రోవైపు అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు స్టైలిష్ స్టార్. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న గ‌త ఏడాది వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు