పెళ్లి అని చెప్పి బిగ్‌బాస్ నటుడు మోసం చేశాడు : యువ నటి ఫిర్యాదు

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని తెలిపింది యువ నటి.

news18-telugu
Updated: February 1, 2020, 5:32 PM IST
పెళ్లి అని చెప్పి బిగ్‌బాస్ నటుడు మోసం చేశాడు : యువ నటి ఫిర్యాదు
Twitter
  • Share this:
తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఇటీవలే తెలుగు బిగ్‌బాస్ మూడవ సీజన్ ముగించుకుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యహారించిన ఈ తాజా షోలో ఈసారి హైదరబాదీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. కాగా అందాల యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచి అదరగొట్టింది. ఈ బిగ్‌బాస్ షో తెలుగులోనే కాకుండా దాదాపు భారతీయ అన్ని ప్రధాన భాషాల్లో ప్రసారం అవుతోంది. ఈ బిగ్‌బాస్ షో తమిళ్‌లో కూడా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ ఈ షోను కమల్ హాసన్ హోస్ట్‌‌గా వ్యవహారిస్తున్నాడు. అది అలా ఉంటే తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తర్షన్‌పై నటి, మోడల్ సనమ్ శెట్టి క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడంటూ పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వివరాలలోకి వెళితే 2019లో తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న తర్షన్ మే 2019లో తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని తెలిపింది. అయితే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో జూన్‌లో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేశామంది.


కాగా ఎప్పుడైతే తర్షన్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాడో అప్పటినుండి తనతో వింతగా ప్రవర్తిస్తున్నాడని, అంతేకాదు పలురకాలుగా వేదిస్తూ తనను హింసించాడని తెలిపింది. తనకోసం దాదాపు 20 లక్షలు కూడా ఖర్చు చేశానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పలు రకాల కారణాతో పెళ్ళి వాయిదావేస్తూ వస్తున్నాడని పేర్కోంది.Twitter
దీంతో విసిగిపోయి ఇటీవల పోలీసులను ఆశ్రయించి 420 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశానని తెలిపింది. అయితే ఈ విషయంపై తర్షన్‌ను వివరణ అడగ్గా అలాంటిదేమి లేదని సనమ్ అబద్దాలు చెబుతోందని తెలిపాడు.


First published: February 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు