బాలకృష్ణలో ప్రేమలో పడిపోయానంటున్న పూరీ జగన్నాథ్..

Puri Jagannadh: నందమూరి బాలకృష్ణతో ఓ సారి పని చేసిన దర్శకులు మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. ఆయనతో ఉన్న బంధం అలా ఉంటుంది మరి. హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 20, 2020, 9:33 PM IST
బాలకృష్ణలో ప్రేమలో పడిపోయానంటున్న పూరీ జగన్నాథ్..
బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)
  • Share this:
నందమూరి బాలకృష్ణతో ఓ సారి పని చేసిన దర్శకులు మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. ఆయనతో ఉన్న బంధం అలా ఉంటుంది మరి. హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా ఆయన కూడా మరో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఈయన కూడా తనకు బాలయ్యతో మళ్లీ సినిమా చేయాలని ఉందని చెప్పాడు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ ఫ్లాప్ అయింది. కానీ బాలయ్యకు మాత్రం పూరీ వర్కింగ్ స్టైల్ నచ్చింది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఇలాంటి స్టైలిష్ సినిమా ఎవరూ చేయలేదని అప్పట్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పాడు ఆయన.

బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)
బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)


ఎప్పుడు కావాలంటే అప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమే అని కూడా చెప్పాడు బాలయ్య. ఇప్పుడు పూరీ ఇదే కావాలంటున్నాడు. బద్రి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ నటించిన పైసా వసూల్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు పూరీ. ఈ సినిమా తనకు కూడా ప్రత్యేకం అంటున్నాడు ఈయన. బాలయ్య నవ్వంటే అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు ఈయన. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడని.. అది చూస్తుంటే ఎనర్జీ వస్తుందని చెప్తున్నాడు పూరీ. ఆయనతో సరదాగా సాగిపోయే పాత్ర చేయించాలనుకున్నానని.. అందుకే పైసా వసూల్ సినిమాను తెరకెక్కించానని చెప్పాడు పూరీ.

బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)
బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)


ఆ సినిమాలో హీరో కారెక్టర్ పేరు తేడా సింగ్ అనే పేరు పెడితే కూడా బాలకృష్ణ ఏమీ అనలేదని గుర్తు చేసుకున్నాడు ఈయన. బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా ఎనర్జీగా ఉంటాడని.. ఆయనతో మరోసారి పని చేయాలని ఉందని చెప్పాడు పూరీ. తనతో సినిమా చేయొద్దని చాలా మంది చెప్పినప్పటికీ బాలయ్య పైసా వసూల్ సినిమాకు ఓకే చెప్పారని.. అప్పుడే ఆయనేంటో తెలిసిందని చెప్పాడు పూరీ. పైసా వసూల్ సినిమా కథను ఆయనకు 10 నిమిషాలే చెప్పినా కూడా తనపై నమ్మకంతో వెంటనే సినిమా చేద్దామని చెప్పినట్లు చెప్పాడు పూరీ జగన్నాథ్. ఆయన ముక్కు సూటి మనిషని.. ప్రేమ, కోపం రెండూ మొహంపైనే చెబుతారని చెప్పాడు ఈ దర్శకుడు.
First published: April 20, 2020, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading