జ్యోతిలక్ష్మి పాటలకు డాన్స్ చేసేవాడ్ని.. : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. అగస్టు 22న పుట్టినరోజును జరుపుకోనున్నారు. అంతేకాకుండా ఆయన నటించిన 'సైరా' అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

news18-telugu
Updated: August 18, 2019, 11:54 AM IST
జ్యోతిలక్ష్మి పాటలకు డాన్స్ చేసేవాడ్ని.. : చిరంజీవి
Photo : Instagram.com/upasanakaminenikonidela
  • Share this:
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. అగస్టు 22న పుట్టినరోజును జరుపుకోనున్నారు. అంతేకాదు ఆయన నటించిన 'సైరా' అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. చిన్న నాటి విషయాలను, సినీ పరిశ్రమలో తన ప్రయాణాన్ని ఇంకా చాలా విషయాలను పంచుకున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కంటే ఆ శిఖరం మీద శాస్వతంగా నిలబడటం చాలా కష్టమని.. టాప్ హీరో ఇమేజ్ చెక్కు చెదరకుండా కొనసాగించడానికి ఎంతో కష్టపడటమే కాకుండా ఈ స్థాయి కోసం ఎంతో పోరాటం చేసానన్నారు చిరు. ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు సినిమాలు చూసేవాడ్నే కాదని, అయితే నటనపై మాత్రం ఇష్టం ఉండేదని చెప్పారు. అందులో భాగంగా పదో తరగతిలో మా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ డ్రామా వేశామని... అందులో నాకు ఉత్తమ నటుడు బహుమతి కూడా వచ్చిందని, కాలేజీలో డ్రామా వేస్తే.. అక్కడా కూడా బెస్ట్‌ యాక్టర్‌‌గా తానేనని చెప్పారు చిరు. 

View this post on Instagram
 

2 days to go!! #SyeRaaTeaser @amitabhbachchan #MegastarChiranjeevi @AlwaysRamCharan #DirectorSurenderReddy #Nayanthara @KichchaSudeepa @actorvijaysethupathi @ravikishann @tamannaahspeaks @niharikakonidela @ameet_trivedi


A post shared by Ram Charan (@alwaysramcharan) on

డాన్స్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో జ్యోతి లక్ష్మి పాటలు చాలా పాపులర్‌ అని.. దీంతో ఆ పాటలు వస్తున్నప్పుడు.. వాటికి డ్యాన్స్‌ చేసేవాడిని.. అది చూసిన మా ఫ్రెండ్స్.. బాగా చేస్తున్నావని.. అందరూ మెచ్చుకునేవారు. ఆ తర్వాత నాకు కూడా ఓ ఆలోచన వచ్చింది.. దీనినే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు అని అనిపించిందని తెలిపారు. దీనికి తోడు మా నాన్న కూడా అప్పట్లో రెండు సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో ఆయన అనుభవాలు నాతో చెప్పేవారని.. అలా నాక్కూడా నటుడ్ని కావాలన్న నా.. ఆలోచనకు బీజం పడిందని చెప్పారు చిరు. 
View this post on Instagram
 

I salute the heroes who have given us the gift of freedom. Happy #IndependenceDay... #JaiHind #Vandemataram #SyeRaa #SyeRaaNarasimhaReddy


A post shared by Ram Charan (@alwaysramcharan) on

ఓ ప్రశ్నకు సమాధానంగా చిరు మాట్లాడుతూ.. తాను తండ్రిగా పిల్లలతో మెలిగిన తీరును చెప్పారు. ఇంట్లో ఎవరిదైనా బర్త్‌డే వస్తుందంటే చాలు.. చాలా హంగామా ఉండేదని చెప్పారు. ఇలాంటీ కార్యక్రమాలను స్టార్‌ హోటల్‌లో సెలబ్రేట్‌ చేసేవాడినని తెలిపారు. పండుగలు, పార్టీల గురించి ఆయన మాట్లాడుతూ.. అసలు ఇండస్ట్రీకి పార్టీ కల్చర్‌ని తీసుకొచ్చింది నేనే అన్నారు. ఆ రోజుల్లో సినిమా ప్రారంభోత్సవం లేదా సినిమా వంద రోజుల పండుగ చేసినా.. సినీ ప్రముఖులందరినీ పిలిచి.. విందు ఏర్పాటు చేసేవాడినన్నారు. ఈ పార్టీలకు బాలకృష్ణ, వెంకటేష్‌లు కూడా వచ్చేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెన్నైలో అప్పట్లో హనీహౌస్‌ అనే ప్రాంతం ఉండేదని.. అక్కడే మా పార్టీలన్నీ జరిగేవన్నారు. అయితే ఈ పార్టీలకు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కూడా ప్రముఖులు వచ్చేవారని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చిరంజీవి.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>