వాళ్ల సంతోషం కోసం నేను... బాడీ షేమింగ్‌పై విద్యా బాలన్ ఏం చెప్పిందంటే...

Vidya Balan : ఇతరుల ఆనందం కోసం తాను సన్నబడితే బాగానే ఉంటుంది అంటూనే... అక్కడో మెలిక ఉందంటూ కొత్త విషయం చెప్పింది విద్యాబాలన్.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 1:38 PM IST
వాళ్ల సంతోషం కోసం నేను... బాడీ షేమింగ్‌పై విద్యా బాలన్ ఏం చెప్పిందంటే...
విద్యాబాలన్ (Image : Twitter)
  • Share this:
బాలీవుడ్‌లో ముద్దుగుమ్మలకు ఎప్పుడూ డిమాండే. బొద్దుగుమ్మలా ఉంటూ కూడా అందర్నీ ఆకట్టుకోవడం విద్యాబాలన్‌కే చెల్లుతోంది. ఆమె లావుగా ఉంటోందన్న కామెంట్లు ఎప్పుడూ ఉండేవే. అయినప్పటికీ... ఆమెను అలాగే ఇష్టపడే ఫ్యాన్స్‌కి లెక్కలేదు. దీనికి తోడు తరచూ ఈ బ్యూటీ... బాడీ షేమర్లను వ్యతిరేకిస్తూ... ఇలాంటివి క్లోజ్ చెయ్యాలని కోరుకునేవారికి ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తోంది. నిజానికి ఫ్యాట్‌ గా ఉంటూ బ్యూటీగా పేరు తెచ్చుకునే ముందు విద్యా కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఒకానొక సందర్భంలో... తన బాడీపై తనకే కోపం వచ్చిందట. దాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక, బాడీ షేప్ మారక, తాను స్లిమ్‌ అయితే, ఎక్కువ మందికి నచ్చుతాననే ఉద్దేశంతో... కొవ్వు కరిగించుకునేందుకు ప్రయత్నించి కొంతవరకూ సక్సెస్ అయ్యిందట. అయితే... తాను సన్నబడితే కూడా కొందరికి నచ్చట్లేదన్న విషయాన్ని గ్రహించిన ఈ ముద్దుగుమ్మ... ఇక ఈ బాడీ షేమింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టకూడదని డిసైడైందట. మిగతా వాళ్ల కోసం మీరు మారడం కాదు... మీకు నచ్చినట్లు మీరు ఉండాలి అంటోంది విద్యాబాలన్.

ఇక తను మారకూడదని డిసైడయ్యాక... తన బాడీ తనకు ఎంతో నచ్చిందనీ, దానితో తాను సంతోషంగా ఉండగలుగుతున్నానని తెలిపింది విద్యాబాలన్. ఎవరేమనుకున్నా... తాను మాత్రం తనలాగా ఉండటాన్నే ఇష్టపడతానని చెప్పింది. తిండి తగ్గించాలి, వెయిట్ తగ్గాలి, డైట్ పాటించాలి అని ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వడం తేలికేనన్న ఈ బ్యూటీ... ఇతరుల బాడీపై కామెంట్లు చెయ్యడం కరెక్టు కాదని చెప్పేసింది. తన బాడీ మారాలనుకునేవారు... మైండ్ మార్చుకుంటే మంచిదంటూ నవ్వేసింది.


ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో మిషన్ మంగళ్‌లో నటిస్తున్న విద్యా బాలన్... అజిత్ కుమార్‌తో కలిసి తమిళ్ థ్రిల్లర్ నెర్కొండ పార్వాయ్‌లో ట్యాలెంట్ చూపించబోతోంది.

 

ఇవి కూడా చదవండి :

110-140 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తాజా విశ్లేషణ...

ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...

మహిళలు వైసీపీకి ఓటు వేశారా... పోలింగ్ డే నాడు చంద్రబాబు వ్యూహం ఫెయిలైందా...
First published: April 15, 2019, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading