Bigg Boss: బిగ్‌బాస్ చూడటం కోసం షూటింగ్ వదులుకున్న మెగా బ్రదర్...

అయితే బిగ్‌బాస్ షో కోసం తన షూటింగ్ సైతం వదులకుంటానని ప్రముఖ హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: November 3, 2019, 5:53 PM IST
Bigg Boss: బిగ్‌బాస్ చూడటం కోసం షూటింగ్ వదులుకున్న మెగా బ్రదర్...
బిగ్‌బాస్ 3 (star maa/Photo)
  • Share this:
బిగ్ బాస్ షో ఫీవర్ అన్ని వర్గాలకు పాకింది. తాజాగా ఈ షోను తమ ఫేవరెట్ గా మార్చుకున్న వారిలో సినీ సెలబ్రిటీలు కూడా చేరారు. అయితే బిగ్‌బాస్ షో కోసం తన షూటింగ్ సైతం వదులకుంటానని ప్రముఖ హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ అతిథిగా హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. వంద రోజుల పాటు సాగిన ఈ షోలో చివరి అంకానికి వచ్చేసింది. ఆదివారం సాగే గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. అయితే ఇప్పటికే గ్రాండ్ ఫినాలే విజేతగా శ్రీముఖి గెలిచిందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో లీకులు పెడుతున్నప్పటికీ, వాటిని నమ్మడానికి వీలులేదని శ్రీముఖి సోదరుడు సుశ్రుత్ పేర్కొన్నాడు. ఇలా బిగ్ బాస్ ఫీవర్ అన్ని వర్గాలను తాకింది.

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>