Home /News /movies /

Sudigali Sudheer - Rashmi Gautam: సుధీర్ అంటే నాక్కూడా ఇష్టమే.. పెళ్లికి రెడీ అంటున్న రష్మి గౌతమ్..

Sudigali Sudheer - Rashmi Gautam: సుధీర్ అంటే నాక్కూడా ఇష్టమే.. పెళ్లికి రెడీ అంటున్న రష్మి గౌతమ్..

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ (sudigali sudheer rashmi gautam)

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ (sudigali sudheer rashmi gautam)

Sudigali Sudheer - Rashmi Gautam: తెలుగు బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), యాంక‌ర్ రష్మి గౌతమ్‌ను(Rashmi Gautam) మించిన సేలబుల్ స్టోరీ మరోటి ఉండదు. మరోసారి సుధీర్, రష్మి జంటగా ప్రోమో వచ్చింది. అది వైరల్ అవుతుంది. ఈ జంటను చూస్తుంటే నిజంగానే ప్రేమలో ఉన్నారేమో.. పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
తెలుగు బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్, యాంక‌ర్ రష్మి గౌతమ్‌ను మించిన సేలబుల్ స్టోరీ మరోటి ఉండదు. ఈ ఇద్దరూ కలిసారంటే చాలు రచ్చ రచ్చే. అందుకే వాళ్లపైనే ప్రోమోలు కూడా కట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. మరోసారి సుధీర్, రష్మి జంటగా ప్రోమో వచ్చింది. అది వైరల్ అవుతుంది. వాళ్ళిద్ధరి మధ్య ఏం లేదనే విషయం చాలా మందికి తెలియదు. కానీ వాళ్ల గురించి తెలిసిన వాళ్లు మాత్రం సుధీర్, రష్మి మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంటారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కనీసం కలవకుండా రష్మి వెళ్లిపోతుంది. ఎవరి పని వాళ్లదే.. ఎవరి జీవితం వాళ్లదే అంటూ చెప్తుంటారు జబర్దస్త్ కమెడియన్లు కూడా. అయితే స్క్రీన్‌పై మాత్రం సుధీర్, రష్మి రెచ్చిపోతుంటారు. ఈ జంటను చూస్తుంటే నిజంగానే ప్రేమలో ఉన్నారేమో.. పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది. అంతగా మన కళ్లను మాయ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.

అందులో మరోసారి సుధీర్, రష్మి మధ్య కెమిస్ట్రీని బాగా హైలైట్ చేసారు. ఇందులో రాకేష్ మాస్ట‌ర్ కూడా ఉన్నాడు. ఆయన సుధీర్‌తో మాట్లాడుతూ ‘నువ్వు ఎవరినైనా లవ్ చేశావా’ అని ప్రశ్నిస్తాడు. దానికి.. ‘నేను ఎవరినీ చేయ‌లేదుగానీ.. నా వెనుక ఓ అమ్మాయి ప‌డుతోంది సార్‌’ అంటూ రష్మిని చూపిస్తాడు.

దానికి వెంటనే రష్మి మాట్లాడుతూ.. ‘రోజా గారూ.. నేను అతడి వెంట పడ్డానా’ అని అడుగుతుంది. మళ్లీ వెంటనే ఇద్దరిపై కొన్ని లవ్ సింబల్స్ వేసి హైలైట్ చేస్తారు. రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని అడుగుతాడు. అప్పుడు సుధీర్ మాట్లాడుతూ.. ‘ఆల్రెడీ ఆహా నా పెళ్లంట షోలో గ‌ట్టిగా జ‌రిగింది’ అని చెప్తాడు. దానికి మళ్లీ రష్మి స్పందిస్తూ.. ‘నాకు సుధీర్ అంటే ఇష్టమే’ అని చెప్తుంది. వెంటనే ఇద్దరి చేతులు కలిపేసాడు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చేవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు