బాహుబలి వల్ల తాను ఏం కోల్పోయాడో చెప్పిన ప్రభాస్..

Prabhas Saaho | సాహో ప్రమోషన్స్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ ఎక్కడకు వెళ్లినా.. హీరోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీడియా, కెమెరాలు, ఇంటర్వ్యూలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 6:05 PM IST
బాహుబలి వల్ల తాను ఏం కోల్పోయాడో చెప్పిన ప్రభాస్..
బాహుబలి పోస్టర్ Photo: Twitter
  • Share this:
బాహుబలి సినిమా ప్రభాస్‌ను దేశవ్యాప్తంగా సూపర్ స్టార్‌ని చేసింది. దేశంలో ఇప్పుడు ఏ మూలకు వెళ్లినా మాహిష్మతి సామ్రాజ్యాధినేతగా ప్రభాస్ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ ప్రభావంతో ఇప్పుడు సాహో ప్రమోషన్స్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ ఎక్కడకు వెళ్లినా.. హీరోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీడియా, కెమెరాలు, ఇంటర్వ్యూలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇదంతా బాహుబలి వల్లే వచ్చింది. అయితే, బాహుబలి వల్ల తన ప్రైవసీ కోల్పోయాడట ప్రభాస్. ఎందుకంటే.. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ దక్షిణాది వారికి సుపరిచితుడే కానీ, ఉత్తరాదిలో అంతగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. ఉత్తరాదిలో ఎక్కడకు వెళ్లినా స్వేచ్ఛగా తిరుగుతూ, తనకు నచ్చినట్టు ఉండే అవకాశం ఉండేది. అయితే, బాహుబలి సినిమాతో అది మొత్తం మారిపోయింది. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ ఎక్కడకు వెళ్లినా.. ‘బాహుబలి’ అంటూ వెంటపడుతున్నారు. దీంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలా? లేకపోతే ప్రైవసీ కోల్పోయానని బాధపడాలో అర్థం కాని పరిస్థితి ప్రభాస్‌కు ఎదురైంది. అయితే, ప్రభాస్ ఎవర్నీ నొప్పించే రకం కాదు కాబట్టి, అందరికీ డార్లింగ్‌గా మారిపోయాడు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>