I LIKE THE HERO MOVIE MAHESHBABU WHO BLESSED ASHOK GALLA SNR
హీరోగా వస్తున్న సూపర్‌స్టార్ మనవడు..మేనల్లుడు అశోక్‌ని ఆదరించమన్న మహేష్
Photo Credit :Twitter
Mahesh support: సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు హీరోగా సంక్రాంతికి వస్తున్నాడు. తన మేనల్లుడు సినిమాలో అద్భుతంగా నటించాడని..తనకు హీరో సినిమా బాగా నచ్చిందని..ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు మహేష్‌బాబు. తన మేనల్లుడు అశోక్గల్లాను ఆశీర్వదించమని వీడియో ద్వారా కోరారు ప్రిన్స్ మహేష్.
తెలుగు సినీ పరిశ్రమలో వారసుల తెరంగేట్రం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్న తమ వాళ్లను చూసుకొని కొందరు యంగ్ స్టార్స్ సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అవుతున్నారు. స్టార్ ఫ్యామిలీల విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ (Super star krishna)కుటుంబానికి చెందిన హీరో అశోక్ గల్లా (Ashok Galla)హీరో సినిమా(Hero movie)తో తెలుగు చిత్ర పరిశ్రమ(Industry)కి పరిచయం అవుతున్నారు. అతను నటించిన హీరో సినిమా సంక్రాంతి (Pongal)కానుకగా రేపు రిలీజ్ (Release)కాబోతోంది. ఆ సినిమాకి మంచి క్లాంపిమెంట్ (Compliment)ఇచ్చారు మరో సూపర్ స్టార్ మహేష్‌బాబు(Super star mahesh babu). తన అక్క కొడుకు అశోక్ యాక్ట్ చేసిన హీరో సినిమా తనకు బాగా నచ్చిందని ..తప్పకుండా అందరికి నచ్చుతుందని చెప్పుకొచ్చారు మహేష్. సంక్రాంతి పండగంటే మా నాన్నకు తనకు ఎంతో సెంటిమెంట్ అని చెప్పిన ప్రిన్స్..అశోక్ గల్లాను అందరూ ఆశీర్వదించాలని కోరారు. సినిమా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్విట్టర్ (Twitter)లో వీడియో(Video)పోస్ట్ చేశారు సూపర్ స్టార్. హీరో సినిమాలో తన మేనల్లుడు అశోక్ గల్లా నటన తనకు బాగా నచ్చిందని..సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చారు ప్రిన్స్. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని తాను నమ్ముతానని చెప్పారు మహేష్‌బాబు. ఈసినిమా ఇంత బాగా రూపొందడానికి కష్టపడిన టెక్నీషియన్లతో పాటు అందరికి శుభాకాంక్షలు తెలిపారు మహేష్‌బాబు.
హీరోగా మావాడు ఇరగదీశాడు..
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, ప్రిన్స్ మహేష్‌బాబు మేనల్లుడిగా సినీ బ్యాంక్ గ్రౌండ్‌తో పాటు అశోక్ గల్లాకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. తండ్రి జయదేవ్ గల్లా పార్లమెంట్ మెంబర్‌గా, నాయనమ్మ గల్లా అరుణకుమారి మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంతటి హై బ్రాండ్ వాల్యూతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అశోక్ గల్లా హీరో కావాలన్న కోరికతో సింగపూర్‌లో యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అశోక్ హీరోగా పరిచయమవుతున్న హీరో సినిమాని పద్మవతి గల్లా నిర్మించారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైనమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో ఈ సినిమా రూపొందించారు.
— Amara Raja Media and Entertainment Pvt Ltd (@amararajaent) January 14, 2022
ఆశోక్ గల్లాని ఆదరించమన్న మహేష్‌బాబు..
యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న హీరో సినిమా సంక్రాంతి కానుకగా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని..తెలుగు ప్రేక్షకులు ఆదరించి..అశోక్‌ని ప్రోత్సహించాలని మహేష్‌బాబు కోరారు. హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈసినిమాని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశారు. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటి గొప్ప నటులు ఈసినిమాలో యాక్ట్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నటవారసుడికి సంక్రాంతి బాగా కలిసిరావాలని సినీ ప్రముఖులు కూడా ఆశీస్తున్నారు. సో అల్ ది బెస్ట్ అశోక్ గల్లా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.