I HURTED BADLY IN THE MUTHAL VASANTHAM MOVIE SHOOTING AND THAT YEAR WAS VERY PAINFUL TO ME SAYS RAMYA KRISHNA SR
ఆ గాయం ఎప్పటికీ మరిచిపోయేది కాదు : రమ్యకృష్ణ
Facebook.com/ramyakrishnanofficial
Ramya Krishna : ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా రమ్యకృష్ణ రాణించారు. ప్రస్తుతం కూడా తన దైన రీతిలో తెలుగు ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు. తన కెరీర్ ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మీడియాతో పంచుకున్నారు.
Ramya Krishna : దక్షిణాదిలో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా రాణించారు రమ్యకృష్ణ. తన అంద చందాలతో పాటు నటనతోను అదరగొడుతూ.. ఇటు కమర్షియల్ ఫిల్మ్స్లలోను , అటూ ఆఫ్ బీట్ సినిమాల్లో తన దైననటనతో తెలుగు హృదయాల్లో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతెందుకు ఆ మధ్య వచ్చిన రాజమౌళి 'బాహుబలి'లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణను తప్ప మరోకరిని ఊహించలేము. అంతలా ఆమె తన నటనతో యావత్ దేశాన్ని ఓ సారి తన వైపుకు తిప్పుకున్నారు. అది అలా ఉంటే ఆ మధ్య రమ్యకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తిర సంఘటల్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ముతల్ వసంతం’ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నాను. ఆ సమయంలో సెట్లో కాస్త విరామం దొరికితే బాగుండు అనుకుంటూ... ఓ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశా.. అందులో భాగంగా.. అక్కడున్న మెట్లపై అడుగు వేశాను. అయితే అది కేవలం సినిమా కోసం వేసిన సెట్ అని, మెట్ల రూపంలో ఉన్న ఓ వస్త్రం అని తర్వాత అర్థమైంది. అది తెలియక నా కాలు దానిపై పెట్టడంతో.. దాదాపు 15 అడుగులు పైనుండి... కింద ఉన్న ఫ్లోర్‌పై పడ్డాను. దీంతో నా కాలి మడమ విరిగింది.. అని చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ. అయితే ఆ సమయంలో ‘ముతల్ వసంతం’ సినిమాలో నటిస్తున్న నటుడు అరుణ్ పాండియన్ నన్ను ఎత్తుకుని దగ్గరలోని దవాఖానకు తీసుకెళ్లారన్నారు.
అంతేకాదు.. కొంత సమయం దవాఖానలో గడిపి.. ఇంటికి వచ్చిన తర్వాత నొప్పితో తెగ ఏడ్చానని చెప్పింది. ఆ గాయం బలంగా తగలడం వల్ల ఆ ఏడాదిలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని.. స్టీల్ రాడ్లు పెట్టి, అతికించారని.. 1984 సంవత్సరం నాకు అతి కష్టమైనదని, ఎప్పుడూ నా జీవితంలో గుర్తుండిపోయే విషయం అని చెప్పింది. ఆ గాయం వల్ల రెండు సినిమాలు తాను కోల్పోయానని. దానికి తోడు తనకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకున్నారని చెబుతూ.. కెరీర్ మొదట్లో తనకు ఎదురైన సంఘటల్ని, పడ్డ భాదల్నీ చెప్పుకొచ్చారు. రమ్యకృష్ణ ప్రస్తుతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'క్వీన్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.