నాకు రెండు కోరికలు.. ఒకటి పిల్లల్ని కనడం.. మరొకటేమో : ప్రియాంక చోప్రా

Priyanka Chopra Jonas : ప్రియాంక చోప్రా..  ఇటీవల ఓగ్ ఇండియా కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: September 10, 2019, 1:39 PM IST
నాకు రెండు కోరికలు.. ఒకటి పిల్లల్ని కనడం.. మరొకటేమో : ప్రియాంక చోప్రా
ప్రియాంక, నిక్ Instagram/priyankachopra
news18-telugu
Updated: September 10, 2019, 1:39 PM IST

Priyanka Chopra Jonas :  ప్రియాంక చోప్రా.. ఓ  గ్లోబల్ స్టార్. అయితే ఈ పేరు వినగానే మరో పేరు కూడా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో అదే నిక్ జోనాస్. అంతెందుకు గూగుల్‌లో ప్రియాంక అని టైప్ చేస్తే..  తోడుగా నిక్ జోనాస్ పేరు కూడా చూపిస్తోంది గూగుల్. గతేడాది కాలంగా ఈ జోడీ ఎంతగా ఫేమస్ అయిపోయారంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. ప్రియాంక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం తెలిసిందే. అందులోభాగంగా ఆమె పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లినా కూడా తన భర్తతో దిగన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హల్‌చల్ చేస్తూ.. ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే  ఉంటుంది. అంతేకాదు అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు హాలీవుడ్‌ను నటిస్తూ.. అదరగొడుతోంది.


 
Loading...

View this post on Instagram
 

Thank you @people 💜 @nickjonas


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

అది అలా ఉంటే.. ఇటీవల ఓగ్ ఇండియా మ్యాగజైన్ సెప్టెంబర్ 2019 ఎడిషన్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. తనకు రెండు కోరికలున్నాయని పేర్కోంది. అందులో ఒకటి ఓ చిన్నారికి జన్మనివ్వడం. రెండోదేమో అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ఓ ఇల్లు కొనుక్కోవడం అని తెలిపింది. అయితే లాస్ ఎంజెలెస్ ఎందుకంటే.. అక్కడి వాతావరణం మన ముంబైకి దగ్గరగా ఉంటుందని..  అందుకే అక్కడే స్థిరపడాలని చూస్తున్నాను అని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. తన భర్త నిక్‌తో కాపురం సాజావుగా సాగుతున్నదని.. స్పష్టం చేస్తూ.. ఆయన పాట పాడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తానంటోంది. అయితే ఆయనతో కలిసి ఎన్నడూ పాట పాడటానికి ధైర్యం చేయలేదు. కానీ ఎవరూ లేనప్పడు ఇద్దరం కలిసి పాటల్నీ హమ్ చేస్తుంటాము అంటోంది. ప్రియాంక తాజా సినిమా 'ది స్కై ఈజ్ పింక్' అక్టోబర్ 11న విడుదలౌతోంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నాడు. 
View this post on Instagram
 

I’m always with you @nickjonas 😜😍Congratulations @jonasbrothers! I’m so proud of all of you! #sucker


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...