కాజల్ అగర్వాల్..చందమామ సినిమాలో తన నటనతో ఎక్కువ మందికి దగ్గరైంది. ఆ తర్వాత కొన్నేళ్లు తెలుగు తెరను ఓ ఊపు ఊపేసింది.. ఈ ముంబై ముద్దుగుమ్మ. అప్పటినుండి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ..నిత్యం బీజీగానే ఉంటోంది. దీనికి కారణం..తన అంద చందాలతో పాటు, ఆమె మనస్థత్వం కూడా. ఇదే విషయాన్ని..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను స్వతహాగా సున్నిత మనస్కురాలినని. ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు అందరికన్నా నాకే ఎక్కువగా ఉంటాయని అంటోంది. ఆమె మాట్లాడుతూ షూటింగ్ జరిగినంత వరకు సినిమాల్లో లీనమై పోతాను. షూటింగ్లో ఎంతసేపు పాల్గోన్న సరే.. షూటింగ్ పైనే నా దృష్టి ఉంటుంది అంటోంది. అంతేకాదు సీన్‌ను బట్టి ఎలా నటించాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటూను..ఈ క్రమంలో అన్నింటిని మర్చిపోతాను. నేను కొన్ని సార్లు హీరోయిన్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. ఓ సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తిస్తాను.
కాజల్ అగర్వాల్ Photo: Twitter
అయితే అదీ ఏమైనా నా బలహీనత ఏమో అని... దీని నుండి తప్పించుకోవాడనికి.. చివరకు వైద్యులను కూడా సంప్రదించాను. అలా ప్రవర్తించడం వ్యాధి కాదని..అది కేవలం ఆలోచన మాత్రమేనని వైద్యులు తేల్చరన్నారు. ఇలా కొంతమందికి జరుగుతుంటుందని.. ఈ విషయాన్ని పెద్దదిగా తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు సలహా ఇచ్చారని చెప్పుకొచ్చింది కాజల్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.