ఆ పని నా వల్ల కాదంటున్న ఆమీర్ ఖాన్

అమీర్ ఖాన్‌కు రీసెంట్‌గా ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

news18-telugu
Updated: September 18, 2018, 10:41 AM IST
ఆ పని నా వల్ల కాదంటున్న ఆమీర్ ఖాన్
అమీర్ ఖాన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో అమీర్ ఖాన్ ఒకరు. అందురో హీరోల్లా మూస సినిమాలు చేయకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా రాణిస్తున్నాడు. ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘దంగల్’,‘సీక్రెట్ సూపర్ స్టార్’ వింటి డిఫరెంట్ సినిమాల సక్సెస్‌తో మన దేశంలోనే కాకుండా చైనా దేశంలో కూడా సత్తా చాటుతున్నాడు.

ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న అమీర్ ఖాన్‌కు రీసెంట్‌గా ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఏది తనకు లేదన్నాడు.

ప్రజలను ఎంటర్టైన్ చేయడమే తన పని అని, అది తప్పించి వేరే పనేది తనకు తెలియదని కుండ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్...అమితాబ్ బచ్చన్‌తో కలిసి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

First published: September 18, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు