హోమ్ /వార్తలు /సినిమా /

Kareena Kapoor: ఆ విషయం గురించి మీడియాలో మాట్లాడాలి.. అదేమీ రహస్యం కాదు.. బాలీవుడ్ నటి కరీనా

Kareena Kapoor: ఆ విషయం గురించి మీడియాలో మాట్లాడాలి.. అదేమీ రహస్యం కాదు.. బాలీవుడ్ నటి కరీనా

కరీనా కపూర్(ఫైల్ ఫొటో)

కరీనా కపూర్(ఫైల్ ఫొటో)

యూనిసెఫ్‌ గుడ్‌విల్ (UNICEF’s Goodwill) అడ్వకేట్‌గా ఉన్న కరీనా కపూర్ యూనిసెఫ్‌ నేతృత్వంలోని 'గరిమా(Garima)' ప్రాజెక్ట్‌లో సభ్యులుగా ఉన్న బాలికలను ప్రశంసించారు.

ప్రతినెలా మహిళలను పీరియడ్స్ పలకరిస్తూనే ఉంటాయి. నెలసరి రావడం అనేది ఒక ప్రకృతి ధర్మం. కాబట్టి రుతుస్రావం (Menstruation) అవుతున్నప్పుడు పాటించాల్సిన శుభ్రతల గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన పనిలేదు. బాలికల నుంచి పెద్దవారి వరకూ అందరిలోనూ పీరియడ్స్ శుభ్రత గురించి చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించారు. బాలీవుడ్ అగ్రతార కరీనా కపూర్ (Kareena Kapoor Khan) సైతం రుతుక్రమం గురించి అద్భుతమైన ప్రసంగం చేసి అందరి మన్నలను అందుకున్నారు. ఆమె నెలసరి గురించి చాలామందిలో పాతుకుపోయిన పాతకాలంనాటి నమ్మకాలను, ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 21న ఈ ముద్దుగుమ్మ తన 41వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా.. గతంలో పీరియడ్స్ గురించి ఆమె పంచుకున్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

యూనిసెఫ్‌ గుడ్‌విల్ (UNICEF’s Goodwill) అడ్వకేట్‌గా ఉన్న కరీనా కపూర్ యూనిసెఫ్‌ నేతృత్వంలోని 'గరిమా(Garima)' ప్రాజెక్ట్‌లో సభ్యులుగా ఉన్న బాలికలను ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో రుతుక్రమ శుభ్రత గురించి అవగాహన కల్పించిన బాలికలను మెచ్చుకున్నారు. 2016లో లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కరీనా.. ఈ సమస్య గురించి మీడియాలో, వెబ్‌సైట్లలో మాట్లాడితే చూడాలని ఉందన్నారు. ఇది రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాదని ఆమె ఘంటా పథంగా చెప్పుకొచ్చారు.

Mobile: కొడుకుకు ఫోన్ కొనివ్వలేకపోయిన తండ్రి.. భార్య అలా చేసేసరికి..


నెలలో 30 రోజులూ విరామం లేకుండా తాను పని చేస్తానన్నారు కరీనా. తాము పనులు చేయడం ఎప్పుడూ కూడా మానేయమని కానీ సరైన ఉత్పత్తులు వినియోగిస్తూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటామని వివరించారు. ఇక ఇతరులు.. ముఖ్యంగా బాలికలు పీరియడ్స్ టైమ్‌లో ఎందుకు పాఠశాల మానేయాలి? అని ప్రశ్నించారు.

COVID-19: గుడ్ న్యూస్.. దేశంలో తగ్గిన ఆర్ వాల్యూ.. ప్రస్తుతం ఎంత ఉందంటే..

‘మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇది సిగ్గుపడే విషయం కాదు. పీరియడ్స్ పరిశుభ్రత కోసం సంబంధిత అక్కడ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగండి. అమ్మాయిలు గా పుట్టినందుకు మనం గర్వపడాలి అని ఆమె బాగా గొప్పగా మాట్లాడారు. అలాగే ఆమె రుతుక్రమ సమయంలో మహిళలకు అండగా నిలవాలి’ అని మగవారికి విజ్ఞప్తి చేశారు. పీరియడ్స్ టైమ్‌లో మహిళలు అనేక ఇబ్బందులతో పాటు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారని అందుకే వారికి సహాయంగా నిలవాలని ఆమె కోరారు

Liquor Shops: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు.. జీవో జారీ.. పూర్తి వివరాలు ఇవే...

అలాగే పాఠశాలలో ఉన్న అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అమ్మాయిల గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. ప్రస్తుతం కరీనా కపూర్ మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా ఆమె తన భర్త సైఫ్ అలీఖాన్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

First published:

Tags: Kareena Kapoor, Women health

ఉత్తమ కథలు