నేను తండ్రి లేకుండా పెరిగాను..నా పిల్లలకు అలా జరగనీయను : కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ ఓ అందాల మెరుపు తీగ. తెలుగులో 2004లో హీరో వెంకటేష్ సరసన  'మల్లీశ్వరి' సినిమా ద్వారా పరిచయమైంది. ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: June 1, 2019, 4:03 PM IST
నేను తండ్రి లేకుండా పెరిగాను..నా పిల్లలకు అలా జరగనీయను : కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ ఓ అందాల మెరుపు తీగ. తెలుగులో 2004లో హీరో వెంకటేష్ సరసన  'మల్లీశ్వరి' సినిమా ద్వారా పరిచయమైంది. ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
  • Share this:
కత్రినా కైఫ్ ఓ అందాల మెరుపు తీగ. తెలుగులో 2004లో హీరో వెంకటేష్ సరసన  'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే ఆ తర్వాత బాలయ్యతో 'అల్లరి పిడుగు'లో నటించిన..ఆ సినిమా బోల్తాకొట్టడంతో తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు. అయితే హిందీలో మాత్రం తన అంద చందాలతో అదరగొడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా యువ హీరోయిన్లకు ధీటుగా దూసుకుపోతోంది అక్కడ. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ సరసన మరోమారు 'భారత్' చిత్రంలో నటిస్తోంది. అయితే గతంలో సల్మాన్, కత్రినా మధ్య ప్రేమ బంధం ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరీ బంధం విడిపోయి ఆ తర్వాత ఈ భామ, చాక్లెట్ బాయ్ రణ్‌భీర్ కపూర్‌తో కొన్నేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే  2016లో వారీ బంధానికి ఫుల్ స్టాప్ పడింది.  అది అలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుకోవాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించగా కత్రినా ఎమోషనల్ అవుతూ  కొన్ని వ్యాఖ్యలు చేసింది. 
Loading...

View this post on Instagram
 


A post shared by Katrina Kaif (@katrinakaif) on

ఆమె మాట్లాడుతూ.. నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న విభేదాలతో విడిపోయారని.. నేను తండ్రి లేకుండా పెరిగాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు నటిగా రాణిస్తున్నాను అంటే నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక పెళ్లి గురించి ఆలోచించినప్పుడల్లా నా బాల్యమే గుర్తొస్తుంది. నాలాగా నా పిల్లలు తండ్రి దగ్గర లేకుండా పెరగకూడదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలతో వాళ్ళు పెరగాలి అని కత్రినా తెలిపింది. అలాగని తండ్రి లేనంత మాత్రాన జీవితంలో సర్వం కోల్పోయినట్లు కాదు. నేను ఏడుగురు తోబుట్టువుల మధ్య తండ్రి లేకుండానే పెరిగానని కత్రినా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...