ఆ పార్టీలో తాగి ఊగిన తాప్సీ...ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Taapsee Pannu, Photo :Instagram.com/taapsee/

తాప్సీ.. తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన అంద చందాలతో భాగానే తెలుగువారికి దగ్గరైంది.

 • Share this:
  తాప్సీ.. తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన అంద చందాలతో భాగానే తెలుగువారికి దగ్గరైంది. సినిమా మంచి హిట్‌‌ను అందుకోవడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. దీంతో వెనుతిరగకుండా..తెలుగులో అందరి కుర్రహీరోలతో నటించింది. ఇటూ తెలుగులో నటిస్తూనే..అటూ హిందీలో కూడ సినిమాలు చేసింది. అయితే ఆ మద్య ఆమె తెలుగులో చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో..అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ బాట పట్టింది ఈ భామ. అందులో భాగంగా..అమితాబ్ బచ్చన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన పింక్ సినిమాలో నటించి..అక్కడ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత హిందీలో చక్కటి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాప్సీ.. గతేడాదిలో విక్కీ కౌశల్‌తో కలిసి 'మన్మర్జియాన్' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అక్కడ మంచి విజయం అందుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్‌లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబందించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తాప్సీ ఫుల్లుగా మద్యం సేవించిందట. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా వెల్లడించారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చిత్రబృందం ఓ పార్టీ చేసుకున్నారట.

  Taapsee Pannu Wasted in Tollywood by giving her Glamour roles and Not used Her Acting capabilities pk.. ఏమో ఇప్పుడు నిజంగానే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయిప్పుడు. బాలీవుడ్‌లో తాప్సీ చేస్తున్న సినిమాలు చూసిన తర్వాత అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈమెను పట్టించుకున్నారా.. ఇక్కడ అసలు ఆమె టాలెంట్ వాడుకున్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. taapsee pannu,taapsee pannu twitter,taapsee pannu instagram,taapsee pannu hot photos,taapsee pannu 60 years look,taapsee pannu 60 yeras lady,taapsee pannu chandro tomar role,taapsee pannu badla movie,hindi cinema,తాప్సీ పన్ను,తాప్సీ 60 ఏళ్ల పాత్ర,వృద్ధురాలి పాత్రలో తాప్సీ,తాప్సీ హిందీ సినిమా
  Actress Taapsee Photo: Taapsee/Instagram


  ఆమె మాట్లాడుతూ ‘‘ఆరోజు మన్మర్జియాన్ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత జరిగిన పార్టీలో నేను, విక్కీ కలిసి బాగా మద్యం సేవించాం.. తర్వాత అక్కడే పడుకోవాలనుకున్నాం. మేము స్టే చేసిన హోటల్ గార్డెన్ నాకెంతో నచ్చింది. ఈ రాత్రి అక్కడే పడుకోవాలనే కోరిక కలిగింది'' అని చెప్పుకొచ్చారు..అయితే ఎలాగోలా అక్కడనుండి..ఇంటికి వెళ్లామని చెప్పారు. తాప్సీ.. ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. 'మన్మర్జియాన్' హిట్ తర్వాత ఆమె అమితాబ్‌తో మరోసారి కలిసి ‘బద్లా' సినిమాలో నటించారు. ఈ సినిమా సైతం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో వరుసగా అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. తాప్సీ.. ప్రస్తుతం.. తడ్కా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్ మొదలగు హిందీ చిత్రల్లో నటిస్తోంది.
  First published: