పిల్లలు ఎప్పుడైతే కావాలనిపిస్తోందో అప్పుడే.. ఆ ముచ్చట : హీరోయిన్ తాప్సి

తాప్సి..'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేసింది. అయితే తెలుగులో ఆమె చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందీలో అవకాశాలు అందిపుచ్చుకొని అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది.

news18-telugu
Updated: June 11, 2019, 5:35 PM IST
పిల్లలు ఎప్పుడైతే కావాలనిపిస్తోందో అప్పుడే.. ఆ ముచ్చట : హీరోయిన్ తాప్సి
తాప్సీ Photo: Instagram.com/taapsee/
  • Share this:
తాప్సి..'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేసింది. అయితే తెలుగులో ఆమె చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందీలో అవకాశాలు అందిపుచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తోంది అక్కడ. తాజాగా ఈ భామ సినిమా 'గేమ్ ఓవర్' విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్‌లో పాల్గోన్న తాప్సి తన పెళ్లి గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ప్రశ్నకు సమాదానంగా..తాప్సీ మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి అంతగా లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. తాను ఏ పార్ట్నర్ కోసం వెతకడం లేదంటూ.. లైఫ్ పార్ట్నర్ కోసం అసలు చూడట్లేదని.. కానీ ప్రొడక్షన్ పార్ట్నర్ కోసం చూస్తున్నాను అని తెలిపింది.  తాప్సి.. నిర్మాతగా కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తోంది. తనతో కలిసి సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నాని పేర్కోంది.

వివరాలలోకి వెళితే వీడియో గేమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'గేమ్ ఓవర్’. ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాప్సీ మీడియాతో మాట్లాడారు ఈ ఇంటర్వ్యూలో.. తన వివాహంపై అడిగిన ప్రశ్నకు బదులుగా .. ఇప్పుడు అయితే నాకు పెళ్లి ఆలోచన లేదంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. నా విషయానికి వస్తే.. నాకు ఎప్పుడైతే పిల్లలు కావాలనే అనిపిస్తోందో అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని తేల్చేసిందే.. తాప్సీ .

First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు