తెలుగులో మాస్ సినిమాలు తీయాలంటే...ఈయన తరువాతనే ఎవరైనా అనే విధంగా పేరు తెచ్చుకున్నారు..బోయపాటి శ్రీను. అందుకు తగ్గట్టుగానే.. ఆయన సినిమాలు కూడా మాస్‌ను ప్రధానంగా ఆకట్టుకోవడానకి వీలుగా రూపోందిస్తున్నారు. ఆ కోవలోనిదే..తాజాగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘వినయవిధేయరామ’. ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా చేస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి 11న అనగా..ఈరోజు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను చిన్న సినిమాలు చేయలేను. ఎందుకంటే.. నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది వారికి 100% ఇవ్వాలి. అవతల ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉండి, మన సినిమా ఇంకోలా ఉంటే ఎలా... అలా కుదరదు.. అందుకే నేను చిన్న సినిమాలు చేయను" అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ బయోపిక్ చేసినా, అందులో కూడా ఖచ్చితంగా దమ్ము ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.