అలాంటి వారితో ఉండటం నా వల్ల కాదు : సమంత

Samantha Akkineni : సమంత... గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో అదరగొడుతోంది. ఇటీవల సమంత చేసిన సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి.

news18-telugu
Updated: September 1, 2019, 7:44 AM IST
అలాంటి వారితో ఉండటం నా వల్ల కాదు : సమంత
Instagram/samantharuthprabhuoffl
  • Share this:
Samantha Akkineni : సమంత అక్కినేని... గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో అదరగొడుతోంది. ఇటీవల సమంత చేసిన సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకున్నాయి. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతుంది. అది అలా ఉంటే సమంతకు కొందరంటే అసలు ఇష్టం ఉండదట... ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా  అబద్ధాలు ఆడేవాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదంటోంది సమంత. ఆమె మాట్లాడుతూ.. కొంతమంది ఊరికే  అవసరం ఉన్నా, లేకున్నా అబద్ధం ఆడేస్తారని... అలా ఆ క్షణానికి ఆ సందర్బం నుండి తప్పించుకుంటారని అలా మట్లాడుతుంటారని పేర్కోంది. అయితే నిజం దాగదని.. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బయటపడిపోతుందని అని తెలిపింది.. సమంత.
 View this post on Instagram
 

Nag mama says “Thankyou for all the love .. always and forever .. your blessings matter the most “


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఇంకా ఆమె మాట్లాడుతూ.. అబద్దం చెప్పి.. ఆ తర్వాత  నిజం బయటపడ్డాక వారిని.. ఎవరు నమ్మరన్నారు. అయితే నిజం చెప్పడం వల్ల ఆ క్షణానికి మనసుకు కాస్త కఠినంగానే ఉంటుంది. అయినా సరే.. నిజమే చెప్పాలని.. అయితే నిజం చెప్పడం వల్ల ఆ మూమెంట్ బాధ లేక కోపం రావోచ్చేమో కానీ.. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిపై ఓ నమ్మకం ఏర్పడుతుందని చెప్పింది సమంత. ఎప్పుడూ  బద్ధకంగా.. చేద్దాంలే అంటూ పనిని వాయిదా వేసేవారంటే ఇష్టం ఉండదని.. అలాంటి వారిని.. నేను సాద్యం అయ్యేంత వరకు దూరం పెడుతుంటానని పేర్కోంది. బద్దకంగా ఉండటం విజేతల లక్షణం కానే కాదని.. ఎప్పుడూ ఏదో ఓ పనిచేస్తుంటే.. అది మనల్నీ ఉత్సాహంగా ఉండండంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని పేర్కోంది సమంత. ప్రస్తుతం సమంత మామ నాగార్జున పుట్టినరోజును జరపడానికి  భర్త నాగచైతన్యతో పాటు, ఫ్యామిలీతో స్పెయిన్‌ వెళ్లింది. అది అలా ఉంటే  సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న '96' తమిళ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: September 1, 2019, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading