హోమ్ /వార్తలు /సినిమా /

ఆ హీరోతో నాకు ఎటువంటి బంధం లేదు: హీరోయిన్ అంజలి

ఆ హీరోతో నాకు ఎటువంటి బంధం లేదు: హీరోయిన్ అంజలి

నటి అంజలి  Photo : Instagram/yours_anjali

నటి అంజలి Photo : Instagram/yours_anjali

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని నటి అంజలి . ఆమె తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి వంటి హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఆమె ఓ హీరోతో ప్రేమలో పడ్డట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

    తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని నటి అంజలి . ఆమె తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి వంటి హిట్ సినిమాల్లో నటించారు.  అంతేకాకుండా తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించారు కూడా... ఈ మధ్య ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అది అలా వుంటే..  ఆమె ప్రేమలో పడ్డట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  తమిళ హీరో జైతో ప్రేమలో ఉన్నట్లు సిని వర్గాల టాక్. అంతేకాకుండా..ఈ జంట కలిసి ఉన్న ఫొటోలు ఇప్పటికే అనేకమార్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి కూడా.  దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే వదంతులు నిజమేనని అందరూ భావించారు. అంతేకాకుండా.. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకున్నారు ప్రేక్షకులు.  ఇదే విషయం అంజలి మాట్లాడుతూ.... జైతో బంధం గురించి  స్పష్టం చేసింది.  తాజాగా అంజలి ఇచ్చిన  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మా మధ్య ఎటువంటి బంధం లేదని... జైని ప్రేమించడం లేదని స్పష్టం చేసింది.


    First published:

    Tags: Tamil Film News, Telugu Cinema

    ఉత్తమ కథలు