ఎన్టీఆర్ గతం తెలిసి కన్నీరు ఆగలేదు: ట్విట్టర్ వేదికగా పాయల్ ఘోష్..

Payal Ghosh : పాయల్ ఘోష్... మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: June 30, 2020, 9:17 AM IST
ఎన్టీఆర్ గతం తెలిసి కన్నీరు ఆగలేదు: ట్విట్టర్ వేదికగా పాయల్ ఘోష్..
ఎన్టీఆర్, పాయల్ ఘోష్ Photo : Twitter
  • Share this:
Payal Ghosh : పాయల్ ఘోష్... మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో క్యూట్‌గా హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. మొత్తంగా ఓ పది సినిమాల్లో చేసిన ఏ సినిమా ఈ భామకు సరైనా గుర్తింపును ఇవ్వలేదు. అది అలా ఉంటే పాయల్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. ఆమె గతంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా పలకడంతో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్‌కు గురైందట. దానికి సంబందించిన కొన్ని ట్వీట్స్‌ను చేస్తూ.. సినీ పరిశ్రమలో ఆశ్రిత పక్షపాతం, నెపోటిజం గురించి తాను మాట్లాడడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని పాయల్ ఘోష్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు కొంత మంది ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారని తెలిపింది. దీనికి సంబందించి ఓ ట్వీట్ చేసిన పాయల్ ఎన్టీఆర్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయం వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పాయల్ వాపోయింది.




ఇక కొంతమంది బెదిరింపుల కారణంగా ట్విట్టర్‌లో డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించినట్టు పాయల్ తెలిపింది. ఓ సినిమా కోసం తారక్ పడే కష్టం మరెవరికీ తెలియదని, ఆయన గతం గురించి తెలిసి కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొంది పాయల్. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నానంటూ ఇక తనను తిట్టడం ఆపాలని కోరింది.
First published: June 30, 2020, 9:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading