హోమ్ /వార్తలు /సినిమా /

బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం ఆ పని చేయలేను: పాయల్ రాజ్‌పుత్‌

బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం ఆ పని చేయలేను: పాయల్ రాజ్‌పుత్‌

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది  పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ సినిమా తర్వాత పాయల్  హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్‌ లవ్‌. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్నే క్రియేట్ చేసాయి.

ఇంకా చదవండి ...

  ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది  పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ సినిమా తర్వాత పాయల్  హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్‌ లవ్‌. తేజస్‌ కంచెర్ల ఈ సినిమాతో హీరోగా  పరిచయం అవుతున్నాడు.  శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సి.కల్యాణ్‌ నిర్మించారు. రీసెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది.ఇప్పటికే విడుదలైన ఈ ఫస్ట్ లుక్,  టీజర్‌ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.  సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా పాయల్ క్యాస్టింగ్ కౌచ్, మీటూ గురించి మాట్లాడారు. ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదలయ్యాక ఓ నిర్మాత పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కోరిక తీర్చమన్నాడు. కానీ నేను ఈ సెక్సువల్ ఫేవర్స్‌కు పూర్తి వ్యతిరేకిని. అందుకే వీటిని ఎప్పుడూ ఖండిస్తుంటాను. చెప్పాలంటే నేను పంజాబ్, ముంబయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మున్ముందు కూడా ఎదురవుతుంటాయని అనుకుంటున్నాను. మీటూ ఉద్యమానికి తెరలేచినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే నాకు వీటి గురించి మాట్లాడే ధైర్యం ఉంది. ‘ఆర్ ఎక్స్ 100’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం వేరొకరితో సెక్స్‌కి ఒప్పుకొంటానని కాదు’ అని వెల్లడించారు.

  పాయల్ రాజ్‌పుత్ (Facebook/Photo)

  పెద్ద సినిమాలలో నటించాలంటే ఇలా కాంప్రమైజ్‌ కావాలి అని అడగటం నా దృష్టిలో బుల్‌షిట్‌. అలాంటి వాళ్లను అసలు కేర్‌ కూడా చేయను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ అడుగుతారు. ఓ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటారు. అంటే అడగడం కామన్‌ అన్నమాట. వాటిని అంగీకరించకూడదు. తిరస్కరించాలి. మన టాలెంట్‌ మీదే మనం ఆధారపడాలి అంటూ తనకు జరిగిన సంఘటను ఈ సందర్భంగా పంచుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.

  First published:

  Tags: Payal Rajput, RDX Love Movie, Telugu Cinema, Tollywood, Venkatesh

  ఉత్తమ కథలు