అమితాబ్ సలహాను ఫాలో కాలేకపోతున్నాను.. రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్, మురగదాస్ కాంబినేషన్ ‘దర్బార్‌’ అనే యాక్షన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: December 17, 2019, 10:21 PM IST
అమితాబ్ సలహాను ఫాలో కాలేకపోతున్నాను.. రజనీకాంత్
Twitter
  • Share this:
సూపర్ స్టార్ రజనీకాంత్, మురగదాస్ కాంబినేషన్ ‘దర్బార్‌’ అనే యాక్షన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్స్‌ను అన్ని ప్రధాన భాషాల్లో విడుదల చేశారు. ఈ సినిమా హిందీలో కూడా విడుదల అవుతోంది. ఈ హిందీ ట్రైలర్ విడుదల వేడుకను సోమవారం ముంబయిలో నిర్వహించింది చిత్రబృందం. ఆ వేడుకలో రజనీకాంత్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ విలేకరి చిత్ర పరిశ్రమలో మీకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఉన్నారా? అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు సమాదానంగా రజనీ స్పందిస్తూ.. తనకు అమితాబ్‌ స్ఫూర్తని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ప్రశ్న నన్ను చాలా సార్లు అడిగారు. అమితాబ్‌ బచ్చన్‌ నాకు స్ఫూర్తి. కెమెరా ముందే కాదు.. కెమెరా వెనుక కూడా ఆయన నాకు మార్గదర్శకం అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు అమితాబ్‌ వద్దని సూచించారు. ‘రజనీ... మనం 60 ఏళ్ల వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలని.. ఎప్పుడూ ఏదో పని చేస్తూ బిజీగా కాలాన్ని గడుపమన్నారు. చివరగా రాజకీయాల్లోకి మాత్రం వెళ్లొద్దని సూచించారన్నారు.

అయితే ఆయన ఇచ్చిన మూడు సలహాల్లో రెండింటిని అనుసరిస్తున్నాను.. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మూడోది మాత్రం ఫాలో కాలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. రజనీకాంత్ 2017 డిసెంబరులో తన రాజకీయ ప్రవేశం గురించి, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రాశీ ఖన్నా..
Published by: Suresh Rachamalla
First published: December 17, 2019, 10:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading