ఫ్యామిలీ టైప్ కాదు.. ప్లే గర్ల్.. పెళ్లిపై శ్రీరెడ్డి పచ్చి కామెంట్స్

శ్రీరెడ్డి

Sri Reddy | తాను డేటింగ్ చేస్తే.. మహా అయితే ఓ ఏడాది అతనితో గడుపుతానని తెలిపింది. ఆ తర్వాత తనకు కొత్త ప్రేమ కావాలని అనిపిస్తుందని ప్రకటించింది.

  • Share this:
    శ్రీరెడ్డి. ఈ పేరు ఓ సంచలనం. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఈ టాలీవుడ్ సంచలనం.. పెళ్లి విషయంలో కూడా అంతే నిర్మొహమాటంగా తన అభిప్రాయన్ని ప్రకటించింది. తన మైండ్ సెట్ ప్రకారం తనకు పెళ్లి సరిపోదని స్పష్టం చేసింది. తనకు నచ్చినట్టు తన జీవితాన్ని తాను అనుభవించాలనుకుంటున్నానని తేల్చేసింది. ‘పెళ్లికి, మనకు సెట్ కాదులే’ అని క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. అదే సమయంలో డేటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డేటింగ్ చేస్తే.. మహా అయితే ఓ ఏడాది అతనితో గడుపుతానని తెలిపింది. ఆ తర్వాత తనకు కొత్త ప్రేమ కావాలని అనిపిస్తుందని ప్రకటించింది. తాను ప్లేగర్ల్ టైప్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వివాదంతో దుమారం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయింది. తమిళ బిగ్ బాస్‌లో పాల్గొనబోతోంది.
    First published: