సర్ కాదు తమ్ముడిని అన్నా.. పవన్ కళ్యాణ్‌కు KTR విన్నపం..

KTR Pawan Kalyan: తెలంగాణ మంత్రి కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య కూడా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 8:21 PM IST
సర్ కాదు తమ్ముడిని అన్నా.. పవన్ కళ్యాణ్‌కు KTR విన్నపం..
కేటీఆర్ పవన్ కళ్యాణ్ (ktr pawan kalyan)
  • Share this:
రాజకీయాలు వేరు.. వ్యక్తిగతం వేరు.. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన వాళ్లు శత్రువులు అయిపోరు. వాళ్ల మధ్య కూడా చాలా మంది అనుబంధం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య కూడా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు విరాళం అందించాడు పవన్. కరోనా బాధితుల కోసం ఈయన మొత్తం 2 కోట్లు అందించాడు. అయితే దీనికి కేటీఆర్ స్పందించాడు.

గ్రేట్ గెస్చర్ అన్నా అంటూ ట్వీట్ చేసాడు. దానికి పవన్ కళ్యాణ్ చూసి రిప్లై కూడా ఇచ్చాడు. మీరు, మీ నాన్నగారు కేసీఆర్ ఇలాంటి విపత్కర సమయంలో చేస్తున్న మంచి పనులు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది.. అద్భుతమైన పని చేస్తున్నారు అంటూ కేటీఆర్‌ను సర్ అని పిలిచాడు. దానికి వెంటనే కేటీఆర్ నుంచి రిప్లై వచ్చింది.


థ్యాంక్స్ అన్నా అంటూ రిప్లై ఇచ్చిన కేటీఆర్.. మీరు నన్ను సర్ అని ఎప్పట్నుంచి పిలుస్తున్నారు.. తమ్ముడు అని పిలవండి అంటూ ట్వీట్ చేసాడు. నేను ఎప్పుడూ మీ తమ్ముడినే అంటూ ఆప్యాయంగా రిప్లై ఇచ్చాడు కేటీఆర్. ట్విట్టర్‌లో ఈ ఇద్దరి చర్చ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు