హైపర్ ఆదిని చూస్తే భయం అంటున్న జబర్దస్త్ కమెడియన్...

హైపర్ ఆది ఫైల్ ఫోటో

తాను అందరు కమెడియన్స్ తో చాలా బాగా ఉంటానని, అయితే హైపర్ ఆది అంటేనే కాస్త భయం అంటూ చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది సెట్ లో ఉంటే చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను హైపర్ ఆదితో కలిసి స్కిట్స్ చేశానని తెలిపాడు.

  • Share this:
    జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ హైపర్ ఆది అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పవచ్చు. ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూస్తాం అనే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువ. అలాంటిది హైపర్ ఆది ఆన్ సెట్స్ మీద ఎలా ఉంటాడు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ నిహాంత్ ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ సెట్ లో కమెడియన్స్ స్కిట్స్ ఎలా ప్రిపేర్ అవుతారు. అనే దానిపై ఇన్ సైడ్ వార్తలు చెప్పాడు.. అందులో తాను అందరు కమెడియన్స్ తో చాలా బాగా ఉంటానని, అయితే హైపర్ ఆది అంటేనే కాస్త భయం అంటూ చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది సెట్ లో ఉంటే చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను హైపర్ ఆదితో కలిసి స్కిట్స్ చేశానని తెలిపాడు. అలాగే హైపర్ ఆది పంచులకు తామంతా ఎంజాయ్ చేశామని నిహాంత్ అన్నాడు.
    Published by:Krishna Adithya
    First published: