నాగబాబు జడ్జిగా వ్యహరిస్తున్న 'అదిరింది', రోజా జడ్జిగా ఉన్న 'జబర్దస్త్' షోల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొన్నటి వరకు జబర్దస్త్ నిర్మాతలపై నాగబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి కార్పొరేట్ కల్చర్ నచ్చకే షోను వదిలేశానని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక 'అదిరింది' స్కిట్లలోనూ జబర్దస్త్ షోపై పలు మార్లు సెటైర్లు వేశారు టీమ్ లీడర్స్. అటు జబర్దస్త్ నిర్వాహకులు సైతం అంతే స్థాయిలో రివర్స్ టార్గెట్ చేశారు. 'అదిరింది' షో ప్రసారమయ్యే సమయానికే జబర్దస్త్ పాత స్కిట్లు వేసి నాగబాబుకు షాక్ ఇచ్చారు. ఇలా రెండు షోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం తయారైంది. ఈ క్రమంలో తాజాగా హైపర్ ఆది వేసిన ఓ పంచ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
గురువారం ప్రసారమైన జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసిన స్కిట్లో పంచ్‌ల వర్షం కురిసింది. ఓ సందర్భంలో స్కిట్లో భాగంగా హైపర్ ఆది కోఆర్టిస్ట్.. మిగతా కంటెస్టంట్లను ఉద్దేశించి నగల్ని, చీరల్ని, వీళ్లని తీసుకెళ్తా అని డైలాగ్ వదులుతాడు. వెంటనే ఆది కలగజేసుకొని.. '' ఆ తీసుకెళ్లురా. మమ్మల్ని, యాంకర్లను, జడ్జిలను తీసుకెళ్లి.. నువ్వు కూడా 'కుదిరింది'అని ఒక షో పెట్టుకో.'' అని అంటాడు. హైపర్ ఆది వేసిన ఆ పంచ్‌తో రోజా ఒక్కసారిగా షాక్ అవుతారు. నోటికి చేయి అడ్డుపెట్టుకొని పగలబడి నవ్వుతారు. నాగబాబు, అదిరింది షోను ఉద్దేశించే హైపర్ ఆది పంచ్ వేశాడని.. యాంకర్ అనసూయ, జడ్జిలకు అర్థమై గట్టిగా నవ్వుతారు. ఐతే నాగబాబుపై ఆది పంచ్ వేయడాన్ని మెగా అభిమానులు తప్పబట్టుతున్నారు. నాగబాబు వల్లే అందరూ ఆ స్థాయికి వచ్చారన్న విషయాన్ని మరవద్దని హితవు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Jabardasth comedy show, Nagababu, Rk roja