హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆదికి అక్సాఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్..ఆ విషయంలో లిమిట్స్‌ క్రాస్ చేయొద్దంటూ..అందరూ చూస్తుండగానే..

హైపర్ ఆదికి అక్సాఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్..ఆ విషయంలో లిమిట్స్‌ క్రాస్ చేయొద్దంటూ..అందరూ చూస్తుండగానే..

అక్సాఖాన్, హైపర్ ఆది

అక్సాఖాన్, హైపర్ ఆది

Hyper aadi-Aqsa Khan: హైపర్ ఆది టీంలోని అక్సాఖాన్ ఇప్పుడు రాజుకు మద్దుతుగా నిలిచింది. రాజు లాంటి టాలెంటెడ్ డాన్సర్ కు ఢీ చాంపియన్ అయ్యే అర్హత ఉందని బల్లగుద్ది చెప్పింది.

Hyper aadi- Aqsa khan: ఢీ షో ప్రస్తుతం సెమీ ఫైనల్ స్థాయికి చేరుకుంది. అయితే ఈ షోలో మొదటి నుంచి దుమ్ముదులిపిన స్టార్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఢీ రాజు, అక్సా ఖాన్, పండు అని ఠక్కున చెప్పేస్తారు. అయితే సెమీఫైనల్స్ కు వచ్చే సరికి ప్రస్తుతం రాజు ఒక్కరే మిగిలారు. అక్సాఖాన్, పండు ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. నిజానికి పండు చాలా టాలెంటెడ్ డాన్సర్, అలాగే త్వరలోనే మాస్టర్ గా కూడా రాణించనున్నాడు. ఇఫ్పటికే వైజాగ్ లో ఓ డాన్స్ స్టూడియో పెట్టి తన శిష్యులను కూడా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక పండు ఎలిమినేషన్ ఒక రకంగా అతడి ఫ్యాన్స్ కు షాకింగ్ అనే చెప్పాలి. అయితే పండు ఎలిమినేషన్ వెనుక చాలా పెద్ద కుట్ర ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా పండు డాన్సులకు వచ్చినంత బజ్ ప్రస్తుత కాలంలో ఢీ షోలో ఏ డాన్సర్ కు రాలేదు అనేది యూట్యూబ్ గణాంకాలు చెబుతున్న వాస్తవం. పండు లేడీ గెటప్ వేసి పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు అంటూ చేసిన డాన్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ అనే చెప్పాలి. అలాంటిది పండు ఎలిమినేషన్ కు ఎలాంటి రీజన్ లేకుండానే బయటకు పంపడంపై అటు ఎలిమినేషన్ ఎదుర్కొన్న అక్సాఖాన్ జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ పై సైతం గుస్సా అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో వివాదం కూడా ఢీ షోను తాకింది. అదే సెమీ ఫైనల్ లో రాజును ఎలిమినేషన్  చేస్తారనే టాక్ నడుస్తోంది. నిజానికి రాజు చాలా టాలెంటెడ్ డాన్సర్, డాన్స్ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఢీ 10 విజేతగా కూడా నిలిచాడు. అయితే ఢీ చాంపియన్స్ సీజన్ లో మాత్రం రాజును వద్దు అనుకుంటూనే నిర్వాహకులు సెమీఫైనల్స్ వరకూ కొనసాగించాల్సి వచ్చింది. ఎందుకంటే రాజు ఫాలోయర్లు ఢీ షో పట్ల నెగిటివ్ ప్రచారం చేస్తారనే భయంతో అతడిని సెమీ ఫైనల్స్ వరకూ కొనసాగించారు.

అయితే రాజు మాత్రం తనకు సుడిగాలి సుధీర్ ఆశీర్వాదం ఉందని, సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కూడా తనకు అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే సుడిగాలి సుధీర్ కూడా క్వాలిఫయర్స్ లో రాజును కాపాడి క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ వరకూ రావడంలో తన పాత్ర పోషించాడు. ఇక ఇఫ్పుడు సెమీ ఫైనల్స్ దశకు ఢీ చాంపియన్స్ చేరుకుంది. ఇలాంటి టైంలో రాజుకు అనుకోని మద్దతు లభించింది.

రైవల్ జట్టు హైపర్ ఆది టీంలోని అక్సాఖాన్ ఇప్పుడు రాజుకు మద్దుతుగా నిలిచింది. రాజు లాంటి టాలెంటెడ్ డాన్సర్ కు ఢీ చాంపియన్ అయ్యే అర్హత ఉందని బల్లగుద్ది చెప్పింది. ఈ విషయంలో హైపర్ ఆదిని ఇన్వాల్వ్ కావద్దని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం తనకు ఎందుకు ఈ వివాదం, నిర్వాహకులు చూసుకుంటారు. అని సైలెంటుగా ఉన్నట్లు  తెలుస్తోంది. కానీ అక్సాఖాన్ మాత్రం అన్ని లిమిట్స్ దాటేసి రాజు పట్ల ఇలా మద్దతుగా నిలవడం ఢీ లో పెద్ద వివాదంగా మారింది.

First published:

Tags: Dhee Dance Reality Show, Hyper Aadi, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు