Home /News /movies /

HYPER ADHI TO CONTINUE IN JABARDASTH NEW PROMO ON DHEE PROGRAM AK

హైపర్ ఆదికి మరో బంపర్ ఆఫర్.. నాగబాబుకు షాక్

నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)

నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)

తాజాగా ఢీ ప్రొగ్రామ్ లేటెస్ట్ ప్రోమో ద్వారాలో హైపర్ ఆది తళుక్కుమన్నాడు. సుధీర్, ప్రదీప్‌తో కలిసి ఆది ఈ ప్రొగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

    జబర్ధస్త్ నుంచి హైపర్ ఆది బయటకు వెళ్లిపోతారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో పాటు చమ్మక్ చంద్ర కూడా ఎగ్జిట్ కావడంతో... ఇక జబర్ధస్త్ నుంచి హైపర్ ఆది కూడా బయటకు వెళ్లిపోవడం ఖాయమనే టాక్ వినిపించింది. అయితే జబర్ధస్త్ నుంచి ఆది బయటకు వెళ్లిపోకుండా మల్లెమాల యూనిట్ ఆపగలిగిందని... ఇందుకు ఆయన కూడా కన్విన్స్ అయ్యారని వార్తలు వినిపించాయి. అయితే మెగాబ్రదర్ నాగబాబుకు ఎంతో సన్నిహితుడిగా పేరున్న హైపర్ ఆది... ఆయనతో కలిసి ఉంటాడా లేదా అనే విషయంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.

    అయితే తాజాగా ఢీ ప్రొగ్రామ్ లేటెస్ట్ ప్రోమో ద్వారాలో హైపర్ ఆది తళుక్కుమన్నాడు. సుధీర్, ప్రదీప్‌తో కలిసి ఆది ఈ ప్రొగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇకపై ఢీ కార్యక్రమంలో ఆది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... జబర్ధస్త్, ఢీ కార్యక్రమాలు మల్లెమాల వారివే కావడంతో...హైపర్ ఆది జబర్ధస్త్ కెరీర్‌లో ఈ కొత్త ప్రోమో ఓ క్లారిటీ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆది జబర్ధస్త్‌లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టే ఢీ కార్యక్రమంలోనూ ఆయనకు అవకాశం ఇచ్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి జబర్ధస్త్‌లో హైపర్ ఆది కంటిన్యూ కాబోతున్నారనే విషయం ఢీ కొత్త ప్రోమో ద్వారా తేలిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth, Nagababu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు