news18-telugu
Updated: February 17, 2020, 4:16 PM IST
అనసూయ, హైపర్ ఆది
జబర్దస్త్ అనగానే అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గుర్తొస్తారు. రష్మీ-సుధీర్, అనసూయ-ఆదిల లవ్ స్టోరీ గురించి జబర్దస్త్‌లో బోలెడన్నీ స్కిట్లు వస్తుంటాయి. ఏకంగా ఆది, సుధీర్‌లే కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకుంటూ ప్రమోషన్ సాధించుకుంటున్నారు. రష్మీని సుధీర్, అనసూయకు ఆది తమ స్కిట్లలో అవకాశం ఇస్తూ రొమాన్స్ పండిస్తున్నారు. అయితే.. హైపర్ ఆది మాత్రం బాగా ముదిరిపోయాడు. అసలు అనసూయ లేనిదే స్కిట్ లేదన్నట్లు ప్రతి స్కిట్లో అనసూయను, లేదా ఆమె పేరుతో ఓ పాత్రను సృష్టించి స్కిట్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రేక్షకులు కూడా ఆది స్కిట్లకు బాగా నవ్వుతుండటం.. అనసూయ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆది అనసూయ జపం చేస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్నారు.
గత కొన్ని రోజులుగా వస్తున్న ఎపిసోడ్లలో అనసూయ లేనిదే ఆది స్కిట్ ఉండకపోయే సరికి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వీరిద్దరిపై జోకులు పేల్చుతున్నారు. అటు.. అనసూయ కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతుండటం కూడా ఆదికి కలిసివస్తోంది. సాధారణంగానే ఆది పంచ్‌లకు కడుపుబ్బా నవ్వుకునే జనం.. అనసూయ గ్లామర్, గాసిప్స్ తోడవడం ఆది స్కిట్లకు మంచి రేటింగ్స్ తీసుకొస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 17, 2020, 4:16 PM IST