Hyper Aadi - Sudigali Sudheer: హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ సహా జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ సహా జబర్తస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ (Twitter/Photo)

Hyper Aadi - Sudigali Sudheer - Jabardasth Comedy Show | ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఎవరెంత తీసుకుంటున్నారంటే..

  • Share this:
    Hyper Aadi - Sudigali Sudheer: ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలను టీవీలో కంటే యూట్యూబ్‌లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కు మధ్యలో తాత్కాలిక బ్రేక్  వచ్చింది.  లాక్‌డౌన్ సడలింపులు తర్వాత జబర్దస్త్ మరోసారి టీవీల్లో సత్తా చూపెడుతూనే ఉంది. లాక్‌డౌన్ తర్వాత టీఆర్పీల విషయంలో కాస్త వెనకబడ్డ.. మళ్లీ స్మాల్ స్క్రీన్ పై తన దూకుడు చూపెడుతూనే ఉంది.

    జబర్థస్త్ షో విషయానికొస్తే..  ఈ షోలో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రోగ్రాంను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదని కామన్  ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా జబర్థస్త్ ప్రోగ్రాంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సందర్భాలున్నాయి. అయినా జబర్ధస్త్ షోకు దూసుకుపోతూనే ఉంది. ఈ ప్రోగ్రామ్‌కు పోటీగా పలు ఛానెల్స్‌లో కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చానా.. అంతగా సక్సెస్ సాధించలేకపోయాయి.  వివాదాల సంగతి పక్కనపెడితే.. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.

    not only hyper aadi sudigali sudheer these jabardasth comedians remunarations is very high here are the details,Jabardasth comedy show,hyper aadi,sudigali sudheer,nagababu,roja instagram,roja twitter,roja,jabardasth sudigali sudheer,telugu anchors remuneration,jabardasth remuneration,jabardasth anchors remuneration,telugu anchor remunaration,telugu anchor suma kanakala remuneration,jabardasth anchor anasuya remuneration,telugu jabardasth anchor rashmi gautam remuneration,telugu cinema,తెలుగు యాంకర్లు,జబర్దస్త్ యాంకర్ అనసూయ,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్స్ రెమ్యునరేషన్స్,తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్,తెలుగు యాంకర్ సుమ రెమ్యునరేషన్,తెలుగు సినిమా,హైపర్ ఆది,సుడిగాలి సుధీర్,
    ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)


    ఈ షోలో  పార్టిసిపేట్ చేసేవారు ఎవరెవరు ఎంతెంత పారితోషకం తీసుకుంటారనే విషయం ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు నెలకు రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషం తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు జబర్థస్త్ జడ్జ్ నాగబాబు ప్లేస్‌లో వచ్చిన మనోకు ఇపుడు రూ. 10 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నారట. బబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ రష్మిలకు నెలకు రూ. 4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

    సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
    సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)


    ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక చంద్ర హైపర్ ఆది కంటే ఎక్కవగా నెలకు రూ. 4.లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, హైపర్ ఆదికి రూ.3 లక్షలు అందుకుంటున్నాడు. మరోవైపు గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకున్నట్టు సమాచారం. బుల్లెట్ భాస్కర్ కు రూ.2లక్షలు, ఇతర కమెడియన్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇంటర్నల్ టాక్. అయితే.. జబర్ధస్త్ కమెడియన్స్‌కు మల్లెమాల టీమ్ వాళ్లు సినిమాల్లో వేషాలు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడంతో వీళ్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు.  మధ్యలో కరోనా కారణంగా రెమ్యునరేషన్‌లో కోతలు విధించినా.. ఫైనల్‌గా అందరికీ ఎప్పటిలాగా ఎవరి పారితోషకాలు వారికి ఇస్తున్నారట. కొత్త యేడాదిలో మాత్రం టీఆర్పీతో పాటు మరింత దూకుడుగా ఈ షో పర్ఫామ్ చేస్తే.. వీళ్ల పారితోషకాలను దాదాపు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: