ఎమ్మెల్యే రోజా చేసిన సహాయానికి కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది...జీవితంలో రుణం తీర్చుకోలేనంటూ...

రోజా, హైపర్ ఆది

సుడిగాలి సుధీర్ సైతం రోజా మాటను గౌరవించి తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ స్టేజీని వదిలి వెళ్లడం ఇష్టం లేదని ఉండిపోయాడు. దీంతో అటు హైపర్ ఆది కూడా సుడిగాలి సుధీర్ బాటలోనే రోజా మాటలను గౌరవిస్తూ జబర్దస్త్ లో కంటిన్యూ అయ్యాడు.

 • Share this:
  హైపర్ ఆది అంటేనే జబర్దస్త్ సృష్టించిన పంచుల మెషిన్ అనే చెప్పాలి. కేవలం త్రివిక్రమ్ సినిమాలకు మాత్రమైన పంచులను బుల్లితెరపై ఏకే 47 రైఫిల్ తరహాలో పేల్చుతూ హైపర్ ఆది 5 ఏళ్లుగా దూసుకెళ్తున్నాడు. అటు వెండితెరపై కూడా హైపర్ ఆది పలు సినిమాల్లో నటించాడు. నటిస్తున్నాడు... అటు మెగా ఫ్యామిలీ అంటే కూడా ఆదికి విపరీతమైన అభిమానం. ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ నాగబాబు అంటే కూడా ఆదికి ఇష్టమే అని చెప్పాలి. అంతేకాదు నాగబాబు భీమవరం ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు స్వచ్చందంగా ప్రచారం కూడా చేశాడు. అదే సమయంలో మరో జడ్జ్ రోజా కూడా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినా, హైపర్ ఆది మాత్రం ఆమెకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. అయితే నాగబాబు ఎగ్జిట్ ఇవ్వడంతో హైపర్ ఆది జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. కానీ మెగా ఫ్యామిలీపై మాత్రం అదే అభిమానం మెయిన్ టెయిన్ చేశాడు. ఒక సమయంలో హైపర్ ఆది జబర్దస్త్ వదిలి నాగబాబు వెంట వెళ్లిపోతే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాడు. అందుకు తగ్గట్టుగా తన ప్యాకేజీ కూడా భారీగానే మాట్లాడుకున్నాడు. తాను తీసుకున్న డెసిషన్ కరెక్టా...రాంగా అని డిసైడ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే రోజాను అభిప్రాయం అడిగాడు. అప్పుడు ఆమె జబర్దస్త్ వదిలి వెళితే కెరీర్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో హైపర్ ఆది ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే, మల్లెమాల క్రియేషన్స్ వారు తీసినంత సీరియస్ గా మరో కామెడీ షోను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమని ఆమె నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయితే అటు సుడిగాలి సుధీర్ సైతం రోజా మాటను గౌరవించి తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ స్టేజీని వదిలి వెళ్లడం ఇష్టం లేదని ఉండిపోయాడు. దీంతో అటు హైపర్ ఆది కూడా సుడిగాలి సుధీర్ బాటలోనే రోజా మాటలను గౌరవిస్తూ జబర్దస్త్ లో కంటిన్యూ అయ్యాడు.

  అయితే అదిరిందిలో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మాత్రం హైపర్ ఆదిపై ఒపినీయన్ మార్చుకున్నాడు. అదిరింది షోలోని సద్దాంతో ఆ మధ్య హైపర్ ఆదిని పోల్చేశాడు. అయితే హైపర్ ఆది కి మాత్రం చిర్రెత్తింది. దీంతో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దాదాపుగా 180కి పైగా స్కిట్లు చేశానని, ఇందులో 40 స్కిట్లకి యూట్యూబ్ లో కోటి వ్యూస్ వచ్చాయని తెలిపాడు.అలాగే మరో నాలుగు స్కిట్లు 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినవి ఉన్నాయని, ఇప్పటివరకు తన కెరీర్లో ఒక్క స్కిట్ కి అత్యధికంగా గా58 మిలియన్ల వ్యూస్ వచ్చాయని కూడా తెలిపాడు. అంతేగాక ఇది ఏదో 5 వారాల హడావిడి కాదని దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటెన్ చేస్తున్నామని, ఈ మెట్రిక్స్ దాటితే అప్పుడు తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

  ఇదిలా ఉంటే హైపర్ ఆది తాను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని తేలిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యే రోజా తనకు సహాయం చేసిందని, ఆమె మాట వినకపోయి ఉంటే, తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేదని హైపర్ ఆది సన్నిహితుల వద్ద వాపోయాడు. ఎందుకంటే అటు జీ తెలుగులో మొదలైన కామెడీ షో వివాదాల్లో చిక్కుకుంది. దీంతో అది దాదాపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రోజా చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
  Published by:Krishna Adithya
  First published: