హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ నయా ప్లాన్.. వర్కౌట్ అయితే అదుర్స్..

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)

Hyper Aadi Sudigali Sudheer | జబర్థస్త్ కామెడీ షో చూసేవాళ్లకు సుడిగాలి, హైపర్ ఆది గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వీళ్లిద్దరు కొత్త ప్లాన్ వేసారు. అది వర్కౌట్ అయితే మాత్రం..

 • Share this:
  జబర్ధస్త్ కామెడీ షో చూసేవాళ్లకు సుడిగాలి, హైపర్ ఆది గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ కామెడీ షోలో వీళ్లిద్దరు చేసే కామెడీను చూసేందుకే ఇష్టపడే అభిమానులు ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీళ్లిద్దరు మెగాభిమానులు. వీలు చిక్కినప్పుడల్లా మెగా హీరోలపై తమ అభిమానాన్ని కురిపిస్తూ తమ విధేయతను ప్రకటించే వారు. అంతేకాదు వీళ్లిద్దరు మెగా బ్రదర్ నాగబాబును తమ గాడ్‌ ఫాదర్ అని చెబుతుంటారు. అలాంటి గాడ్ ఫాదర్.. జబర్ధస్త్ కామెడీ షో ఒదిలేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఈ వీరాభిమానులు తప్పించి చాలా మంది నాగబాబుతో కలిసి ఆ  ప్రోగ్రామ్‌కు షిప్ట్ అయ్యారు. వీళ్లు కూడా అదిరింది ప్రోగ్రామ్ కోసం జబర్ధస్త్ వీడుతారని అందరు అనుకున్నారు. కానీ వీళ్లు మాత్రం తమకు నాగబాబు గాడ్ ఫాదరే కానీ.. తమకు లైఫ్ ఇచ్చి జబర్ధస్త్ కామెడీ షోను మాత్రం ఒదిలే ప్రసక్తి లేదంటున్నారు. ఇక నాగబాబు కూడా తన ‘అదిరింది’ ప్రోగ్రామ్ కోసం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌ను రప్పించేందకు ప్రయత్నించినా అది నెరవేరలేదు.

  నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ (Twitter/Photo)


  తాజాగా హైపర్ ఆది, సుడిగాలి మాత్రం నాగబాబును మరలా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో జడ్జ్‌గా రప్పించేందకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై వీళ్లిద్దరు మల్లెమాల టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టు ఇపుడు వీళ్లిద్దరు కలిసి నాగబాబును మరలా జబర్ధస్త్‌లోకి రప్పించేందకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక మల్లెమాల వాళ్లు కూడా నాగబాబు వస్తే తమకెలాంటి ఇబ్బంది లేదన్నట్టు చెప్పారట. కానీ నాగబాబు.. ఇప్పటికే జీ తెలుగు ‘అదిరింది’ ప్రోగ్రామ్ కోసం కాంట్రాక్ట్ సైన్ చేసాడు. ఎంత లేదన్నా ఇది ఒక యేడాది పాటు ఉందట. ఆ కాంట్రాక్ట్ అయిపోయే లోపల నాగబాబును మరలా జబర్ధస్త్‌లోకి రప్పించేందకు వీళ్లద్దరు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఏమైనా జబర్ధస్త్ విషయంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: