హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది వార్నింగ్...రాకేష్ మాస్టర్‌‌ నోరు జాగ్రత్త...మాటలు పడేందుకు శేఖర్ కాదంటూ...

హైపర్ ఆది వార్నింగ్...రాకేష్ మాస్టర్‌‌ నోరు జాగ్రత్త...మాటలు పడేందుకు శేఖర్ కాదంటూ...

హైపర్ ఆది, రాకేష్ మాస్టర్

హైపర్ ఆది, రాకేష్ మాస్టర్

తన ఫీల్డ్ తో సంబంధం లేకపోయినా రాకేష్ మాస్టర్ పరిధి దాటి విమర్శలు చేశాడనే టాక్ వినిపిస్తోంది.

    హైపర్ ఆది అంటే చాలా కష్టపడే తత్వం కలవాడని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఆదికి ఇష్టం. అంతేకాదు తనకు బ్రేక్ ఇచ్చిన అదిరే అభి అంటే హైపర్ ఆదికి విపరీతమైన అభిమానం. నిజానికి జబర్దస్త్ లో హైపర్ ఆది కేవలం 5 సంవత్సరాల గ్యాప్ లోనే టీమ్ మెంబర్ నుంచి లీడర్ స్థాయికి ఎదిగాడు. హైపర్ ఆది టీమ్ మేట్స్ కూడా ఎప్పుడూ కంప్లైంట్స్ చేయరు...పేమెంట్స్ విషయంలో కూడా చాలా కచ్చితంగా ఉంటాడని, అందరికీ హెల్ప్ చేస్తాడని మంచి పేరుంది. అలాంటి హైపర్ ఆదిని పట్టుకొని రాకేష్ మాస్టర్ అనరాని మాటలు అన్నాడు. అంతేకాదు తన ఫీల్డ్ తో సంబంధం లేకపోయినా రాకేష్ మాస్టర్ పరిధి దాటి విమర్శలు చేశాడనే టాక్ వినిపిస్తోంది. దానిపై హైపర్ ఆది డైరక్టుగా వార్నింగ్ ఇవ్వకపోయినా, సన్నిహితుల వద్ద మాత్రం బాగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఢీ షోలో శేఖర్ మాస్టర్ జడ్జి కావడంతో అతనితో కాస్త క్లోజ్ గా ఉంటానని, రాకేష్ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు మధ్య ఎన్నో గొడవలు ఉండవచ్చని, తనకు ఏం సంబంధమని, తానేమీ శేఖర్ మనిషి కాదని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే హైపర్ ఆది విషయంలో రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ పై అటు నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth

    ఉత్తమ కథలు