హైపర్ ఆది షాకింగ్ నిర్ణయం...మెగాబ్రదర్‌తో ముగిసిన బంధం...ఇక సమరమే...

హైపర్ ఆదికి ఇప్పుడిప్పుడే తనకు ఎవురు నిజమైన ఆప్తులో...ఎవరు ఆప్తులు కారో తెలుసుకునే టైమ్ వచ్చేసిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 4:09 PM IST
హైపర్ ఆది షాకింగ్ నిర్ణయం...మెగాబ్రదర్‌తో ముగిసిన బంధం...ఇక సమరమే...
నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)
  • Share this:
హైపర్ ఆది అంటేనే జబర్దస్త్ సృష్టించిన పంచుల మెషిన్ అనే చెప్పాలి. కేవలం త్రివిక్రమ్ సినిమాలకు మాత్రమైన పంచులను బుల్లితెరపై ఏకే 47 రైఫిల్ తరహాలో పేల్చుతూ హైపర్ ఆది 5 ఏళ్లుగా దూసుకెళ్తున్నాడు. అటు వెండితెరపై కూడా హైపర్ ఆది పలు సినిమాల్లో నటించాడు. నటిస్తున్నాడు... అటు మెగా ఫ్యామిలీ అంటే కూడా ఆదికి విపరీతమైన అభిమానం. ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ నాగబాబు అంటే కూడా ఆదికి ఇష్టమే అని చెప్పాలి. అంతేకాదు నాగబాబు భీమవరం ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు స్వచ్చందంగా ప్రచారం కూడా చేశాడు. అదే సమయంలో మరో జడ్జ్ రోజా కూడా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినా, హైపర్ ఆది మాత్రం ఆమెకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. అయితే నాగబాబు ఎగ్జిట్ ఇవ్వడంతో హైపర్ ఆది జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. కానీ మెగా ఫ్యామిలీపై మాత్రం అదే అభిమానం మెయిన్ టెయిన్ చేశాడు. అదిరిందిలో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మాత్రం హైపర్ ఆదిపై ఒపినీయన్ మార్చుకున్నాడని టాక్ వస్తోంది. అయితే అదిరింది షోలోని సద్దాంతో ఆ మధ్య హైపర్ ఆదిని పోల్చేశాడు. అయితే హైపర్ ఆది కి మాత్రం చిర్రెత్తింది. దీంతో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దాదాపుగా 130 స్కిట్లు పైగా చేశానని, ఇందులో 40 స్కిట్లకి యూట్యూబ్ లో కోటి వ్యూస్ వచ్చాయని తెలిపాడు.అలాగే మరో నాలుగు స్కిట్లు 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినవి ఉన్నాయని, ఇప్పటివరకు తన కెరీర్లో ఒక్క స్కిట్ కి అత్యధికంగా గా58 మిలియన్ల వ్యూస్ వచ్చాయని కూడా తెలిపాడు.

అంతేగాక ఇది ఏదో 5 వారాల హడావిడి కాదని దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటెన్ చేస్తున్నామని, ఈ మెట్రిక్స్ దాటితే అప్పుడు తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి హైపర్ ఆదికి ఇప్పుడిప్పుడే తనకు ఎవురు నిజమైన ఆప్తులో...ఎవరు ఆప్తులు కారో తెలుసుకునే టైమ్ వచ్చేసిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading