HYPER AADI SHOCKING COMMENTS WITH VISHNU PRIYA IN JABARDASTH PROMO NR
Hyper Aadi - Vishnu Priya: ఏదైనా చేద్దాం అంటే కెమెరాలు అడ్డొస్తాయ్.. విష్ణుప్రియతో హైపర్ అది షాకింగ్ కామెంట్స్!
hyper aadi
Hyper Aadi - Vishnu Priya: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ప్రస్తుతం తన గ్లామర్ తో మరింత పరిచయాన్ని పెంచుకుంటుంది. యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. అనసూయ, శ్రీముఖి లను మించి హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది.
Hyper Aadi - Vishnu Priya: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ప్రస్తుతం తన గ్లామర్ తో మరింత పరిచయాన్ని పెంచుకుంటుంది. యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. అనసూయ, శ్రీముఖి లను మించి హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలను, తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆది.. విష్ణుప్రియ లవ్ ట్రాక్ ను ఏకంగా తన పేరుతో బయటకు లాగాడు.
యాంకరింగ్ కు మొదట వెండితెరపై నటించింది విష్ణు ప్రియ. మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో బుల్లితెర పై అడుగు పెట్టి యాంకరింగ్ తో సెలబ్రిటీ హోదాను అందుకుంది. ఇక మరో ఆర్టిస్ట్ సుధీర్ తో కలిసి పోవే పోరా షోలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు షో లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది. ఇక ఈ షోలో సుధీర్ తో సన్నిహితంగా ఉండటంతో లవ్ ట్రాక్ నడిపినట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ బుల్లితెరలో ఓ షోలో తెగ సందడి చేసింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో స్టార్ కమెడియన్ హైపర్ ఆది టీమ్ లో గెస్ట్ గా పాల్గొన్నది విష్ణుప్రియ. అంతేకాకుండా ఎంట్రీ తోనే బాగా సందడి చేసింది. ఇక ఆది కూడా తన పంచ్ లతో తెగ నవ్వించాడు. ఆది నవ్వుతూ ఉండగా.. వెంటనే విష్ణు ప్రియ 'ఆది నువ్వు అంత చిరాకు గా చేస్తున్నావ్. పెళ్లప్పుడు ఎంత రొమాంటిక్ గా ఉండే వాడివో' అనగా వెంటనే ఆది ఏంటే రొమాన్స్.. 'ముద్దు పెట్టుకుందామంటే నీ ముక్కు అడ్డం వస్తుంది. హగ్ చేసుకుందామంటే నా పొట్ట అడ్డు వస్తుంది' అని పంచ్ వేస్తాడు. ఇక విష్ణు ప్రియా బయట చల్లగాలి.. లోపల పిల్లగాలి అని అనడంతో.. దీనికి ఈ గాలులన్ని ఆ గాలోడివే అని సుధీర్ ను లాగుతూ కామెంట్ చేశాడు హైపర్ ఆది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.