Home /News /movies /

HYPER AADI SETIRS ON KAJAL AGGARWAL MARRIAGE IN JABARDASTH COMEDY SHOW HERE ARE THE DETAILS TA

Hyper Aadi-Kajal: కాజల్ పెళ్లిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్...ఎమ్మెల్యే రోజా చూస్తుండగానే...

కాజల్ అగర్వాల్ (Youtube/Credit)

కాజల్ అగర్వాల్ (Youtube/Credit)

Hyper Aadi-Kajal Aggarwal Marriage | జబర్థస్త్ కామెడీ షోలో హైపర్ ఆది ఎపుడు ఎవరిపై ఎలాంటి సెటైర్లు వేస్తాడో చెప్పడం కాస్త కష్టమే.తాజాగా హైపర్ ఆది.. జబర్ధస్త్ కామెడీ షోలో కాజల్ అగర్వాల్ పెళ్లి పై తనదైన శైలిలో సెటైరికల్ స్కిట్ చేసాడు.

ఇంకా చదవండి ...
    Hyper Aadi-Kajal Aggarwal Marriage | జబర్థస్త్ కామెడీ షోలో హైపర్ ఆది ఎపుడు ఎవరిపై ఎలాంటి సెటైర్లు వేస్తాడో చెప్పడం కాస్త కష్టమే. అపుడపుడు జబర్ధస్త్ జడ్జ్ ఎమ్మెల్యే రోజాను కూడా తనదైన శైలిలో సెటైర్లు వేసి ఆడియన్స్‌ను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా హైపర్ ఆది.. జబర్ధస్త్ కామెడీ షోలో కాజల్ అగర్వాల్ పెళ్లి పై తనదైన శైలిలో సెటైరికల్ స్కిట్ చేసాడు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది.. కాజల్ అగర్వాల్ పెళ్లిని జీర్ణించుకోలేని అమర ప్రేమికుడిగా తనదైన నటన ప్రదర్శించాడు. వెంకటేష్ హీరోగా నటించిన  ప్రేమ సినిమాలో  ప్రియతమా.. నా హృదయమా అంటూ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని తన ఆశలపై నీళ్లు చల్లినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఇక హైపర్ ఆది చేసిన ఈ స్కిట్ ప్రోమో నవ్వులు పూయించేలా ఉంది. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పెళ్లితో ఎంతో మంది ఆమె అభిమానులు ఇదే పరిస్థితిని ఫేస్ చేసినట్టు కళ్లకు కట్టినట్టు చూపించాడు హైపర్ ఆది. అతను ఈ స్కిట్ చేస్తున్నపుడు జడ్జోస్ రోజా, మనోతో పాటు యాంకర్ అనసూయ బాగానే ఈ స్కిట్ ఎంజాయ్ చేసారు.

    కాజల్ అగర్వాల్ విషయానికొస్తే..ఈమె తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా గత నెల అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పూజలు పురస్కారాలు నిర్వహించిన కాజల్ భర్తతో కలిసి హనీమూన్‌కి వెళ్లింది. భర్త గౌతమ్‌తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ భామ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కాజల్.. ఆచార్య షూటింగ్‌లో డిసెంబర్ 5న జాయిన్ కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Kajal Aggarwal, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు