HYPER AADI SENSATIONAL PUNCHES ON STAR ANCHOR SUMA KANAKALA IN F3 SHOW AND TARGETED HER ANCHORING PK
హైపర్ ఆది పంచులతో బిత్తరపోయిన యాంకర్ సుమ కనకాల..
హైపర్ ఆది సుమ కనకాల ఎఫ్3 షో
హైపర్ ఆది అంటేనే పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్. మనోడు నోరు తెరిస్తే చాలు పంచ్‌ల వర్షం కురుస్తుంది. అంతగా రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్ షోలోనే కాదు.. బయట కూడా ఆది మాటతీరు అలాగే ఉంటుంది.
హైపర్ ఆది అంటేనే పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్. మనోడు నోరు తెరిస్తే చాలు పంచ్‌ల వర్షం కురుస్తుంది. అంతగా రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్ షోలోనే కాదు.. బయట కూడా ఆది మాటతీరు అలాగే ఉంటుంది. ఏ షోకు వచ్చినా కూడా ఆది డైలాగుల వర్షం మాత్రం ఆగదు. ఇప్పుడు కూడా ఇలాగే రెచ్చిపోయాడు ఈ కుర్ర కమెడియన్. తాజాగా సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఎఫ్ 3 షోకు వచ్చాడు ఆది. అక్కడ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. మధ్యలో కాస్త హద్దులు దాటే పంచులు పేల్చినా కూడా నవ్వులు కూడా పూసాయి. ఇక యాంకర్ సుమను కూడా మామూలుగా ఆడుకోలేదు ఈ కమెడియన్.
హైపర్ ఆది సుమ కనకాల ఎఫ్3 షో
ప్రోమోలోనే కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాడు. ముఖ్యంగా సుమ యాంకరింగ్ గురించి చెబుతూ ఏ ఛానెల్ పెట్టినా మీరే కనిపిస్తుంటారు.. వేరే వాళ్లకు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వరా అంటూ పంచ్ వేసాడు. అక్కడితో ఆగకుండా కనీసం షోస్ మధ్యలో యాడ్స్ అయినా చూద్దామంటే అక్కడ కూడా మినపగుళ్లు పట్టుకుని వచ్చేస్తున్నారంటూ మరో పంచ్ వేసాడు.
పెళ్లి గురించి నీ ఒపినియన్ ఏంటి ఆది అంటే.. దేనికోసమో చేసుకోవాలనిపించి.. చివరికి దీనికోసమా మనం చేసుకున్నది అనిపించేదే పెళ్లంటే అంటూ తనదైన శైలిలో కాస్త సెటైరికల్ పంచ్ వేసాడు ఆది. ఏం చేసినా.. ఎన్ని పంచులు వేసినా కూడా ఎవర్ని కించపరచడానికి కాదు.. నవ్వించడానికి మాత్రమే అంటున్నాడు ఈయన. సుమ లాంటి యాంకర్ తెలుగులో ఉండటం మన అదృష్టం అంటున్నాడు ఆది. ఆమెను చూసి చాలా మంది నేర్చుకున్నారని.. ఎంతోమందికి స్పూర్థిగా సుమ నిలిచారని చెప్పాడు ఈ కమెడియన్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.