వివాదాల్లో తలదూర్చడం హైపర్ ఆదికి అలవాటే. జబర్దస్త్ స్కిట్ల ద్వారా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లు, ప్రేక్షకులతో తిట్లు తిట్టించుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ మరోసారి వివాదాల్లో తలదూర్చాడు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎద్దేవా చేస్తున్నట్లు స్కిట్ చేసి ఆర్జీవీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమా ఆధారంగా స్కిట్ చేశాడు. ఈ సినిమాను రాఘవేంద్రరావు తీసిన విషయం తెలిసిందే. స్కిట్లో రాఘవేంద్రరావు కేరెక్టర్‌తో పాటు, రామ్ గోపాల్ వర్మ కేరెక్టర్‌ను పొందుపరిచాడు. అందులో ఆర్జీవీ కేరెక్టర్‌పై సెటైర్లు వేశాడు హైపర్ ఆది. కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేశాడు. ఆ కామెంట్లకు, సైటర్లకు తీవ్రంగా నొచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ అభిమానులు హైపర్ ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కేరెక్టర్లు చేసుకునే ఆర్టిస్టువేనని, సీనియర్ డైరెక్టర్లపై సైటర్లు వేయడమా? అంటూ హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఆదికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ కూడా నడుస్తోంది మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Hyper Aadi, Jabardasth, Rashmi Gautam, RGV, Roja, Sudigali sudheer