హోమ్ /వార్తలు /సినిమా /

Hyper Aadi: హైపర్ ఆది అసలు పేరు ఏంటో తెలుసా.. హైపర్ ఆదిగా మార్చింది ఎవరంటే..

Hyper Aadi: హైపర్ ఆది అసలు పేరు ఏంటో తెలుసా.. హైపర్ ఆదిగా మార్చింది ఎవరంటే..

కామెడీ కోసం ఏమైనా చేయండి కానీ అమ్మాయిలను ఇంత దారుణంగా కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి హైపర్ ఆది అంటూ మండి పడుతున్నారు. అయితే ఇలాంటి మండి పడటాలు కొన్నేళ్లుగా చూస్తున్నాడు ఆది. అయినా మారలేదు.. మరి ఇప్పుడైనా ఆ మార్పు కనిపిస్తుందో లేదో..?

కామెడీ కోసం ఏమైనా చేయండి కానీ అమ్మాయిలను ఇంత దారుణంగా కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి హైపర్ ఆది అంటూ మండి పడుతున్నారు. అయితే ఇలాంటి మండి పడటాలు కొన్నేళ్లుగా చూస్తున్నాడు ఆది. అయినా మారలేదు.. మరి ఇప్పుడైనా ఆ మార్పు కనిపిస్తుందో లేదో..?

Hyper Aadi | తెలుగు టీవీ‌ ఛానెల్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇక హైపర్ ఆది అసలు పేరు విషయానికొస్త..

  Hyper Aadi | తెలుగు టీవీ‌ ఛానెల్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  జబర్ధస్త్ షోలో  కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపించే హైపర్ ఆది. . తాజాగా  ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో యాంకర్ వర్షిణితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను జబర్ధస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం వెనక ఎంత కష్టపడింది. అలానే  జబర్ధస్త్ కామెడీ షో నుంచి సినిమాల్లోకి ప్రమోషన్ పొందడం వెనక ఉన్న కృషిని ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆదితో పాటు యాంకర్ వర్షిణి కూడా హైపర్ ఆదితో కలిసి వేదికను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె కూడా యాంకర్‌గా మారడం వెనక ఎంత కృషి ఉందో వివరించింది. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్ధస్త్ కామెడీ షోలో తన అసలు పేరు ఏంటో చెప్పాడు. ఇక హైపర్ ఆది అసలు పేరు ఆదయ్య. వాళ్ల తాతగారి పేరు ఆదయ్య. అదే పేరును తనకు తల్లితండ్రులు పెట్టరన్నారు. ఇక జబర్ధస్త్ షోకు వచ్చిన తర్వాత ఆదయ్యను కాస్తా.. ఆదిగా మార్చుకున్నాను.

  hyper aadi varshini war,hyper aadi varshini war in australia,hyper aadi varshini dance latest,hyper aadi varshini love story,hyper aadi varshini,hyper aadi varshini romance,hyper aadi funny comments on varshini,hyper aadi hilarious punch to anchor varshini,hyper aadi varshini love,hyper aadi jabardasth,hyper aadi and varshini performance,హైపర్ ఆది వర్షిణి,జబర్దస్త్ హైపర్ ఆది వర్షిణి వార్,హైపర్ ఆది వర్షిణి ఆస్ట్రేలియాలో గొడవ
  హైపర్ ఆది వర్షిణి (hyper aadi varshini)

  కానీ జబర్ధస్త్ డైరెక్టర్స్.. తాను వేసే స్కిట్స్ చూసి.. ముందు హైపర్ చేర్చారన్నారు. అలా తాను అప్పటి నుంచి నేను.. ఆదయ్య నుంచి ఆదిగా.. అటు నుంచి హైపర్ ఆదిగా మారారన్నారు. మరోవైపు హైపర్ ఆది తన పెళ్లి విషయమై.. మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను కెరీర్ పై దృష్టి పెడతానన్నారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు ఏమి లేవన్నాడు. అంతేకాదు తనకు ఇపుడు  సోలో బ్రతుకు సో బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇండస్ట్రీలో రావడానికి తనకు కొంత మంది చేతిలో మోసపోయిన విషయాన్ని ప్రస్తావించాడు హైపర్ ఆది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hyper Aadi, Jabardasth comedy show, Tollywood

  ఉత్తమ కథలు