హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది విషయంలో సపోర్ట్ చేస్తున్న శేఖర్...రాకేష్ మాస్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్...

హైపర్ ఆది విషయంలో సపోర్ట్ చేస్తున్న శేఖర్...రాకేష్ మాస్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్...

హైపర్ ఆది, రాకేష్ మాస్టర్

హైపర్ ఆది, రాకేష్ మాస్టర్

ఇప్పటికే హైపర్ ఆది రాకేష్ మాస్టర్ కు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వగా, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా దానికి జతయ్యాడు. శేఖర్ మాస్టర్ కూడా తన వల్లనే హైపర్ ఆది ఇలా మాటలు పడాల్సి వచ్చి ఉంటుందని సన్నిహితుల వద్ద ఫీలయినట్లు సమాచారం.

    హైపర్ ఆదిపై రాకేష్ మాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. హైపర్ ఆదికి రోజుకు రోజుకు సపోర్ట్ పెరుగుతోంది. అటు నెటిజన్లు సైతం హైపర్ ఆదిని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్య‌కాలంలో యూట్యూబ్ లో  సెల‌బ్రిటీల‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతోన్న రాకేశ్ మాస్ట‌ర్…త‌న‌పైనే పేరడీ చేయ‌డంతో ఆదిపై ఓ లెవ‌ల్ లో ఫైర‌య్యాడు. అయితే ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వాన అయ్యింది. ఇప్పటికే హైపర్ ఆది రాకేష్ మాస్టర్ కు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వగా, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా దానికి జతయ్యాడు. శేఖర్ మాస్టర్ కూడా తన వల్లనే హైపర్ ఆది ఇలా మాటలు పడాల్సి వచ్చి ఉంటుందని సన్నిహితుల వద్ద ఫీలయినట్లు సమాచారం. అయితే హైపర్ ఆది విషయంలో శేఖర్ త్వరలోనే నోరు విప్పే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాకేష్ మాస్టర్ అన్ని లెవెల్స్ దాటిపోయి కామెంట్స్ చేస్తున్నాడని శేఖర్ సన్నిహితులైన సీనియర్ మాస్టర్ల వద్ద వాపోయినట్లు సమాచారం లభిస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఈ వివాదం ఇక్కడితో ఆపేద్దామని ఆలోచిస్తున్నట్లు సన్నిహితుల వద్ద సమాచారం ఉంది. అయితే హైపర్ ఆది విషయంలో ఇలా అందరూ ఒక్కతాటిపైకి రావడంతో రాకేష్ మాస్టర్ వెనక్కు తగ్గే చాన్స్ ఉందని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth

    ఉత్తమ కథలు