శ్రీముఖిపై హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు... బి‌గ్‌బాస్‌లో ఉండి మైండ్ పోయిందంటూ..

జబర్ధస్త్ షో కమెడియన్  హైపర్ ఆది మరోసారి బిగ్‌బాస్ రన్నరప్ శ్రీముఖి పై అదిరిపోయే పంచ్‌లు వేసాడు.

news18-telugu
Updated: December 9, 2019, 9:50 AM IST
శ్రీముఖిపై హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు... బి‌గ్‌బాస్‌లో ఉండి మైండ్ పోయిందంటూ..
శ్రీముఖి,హైపర్ ఆది (Twitter/Photo)
  • Share this:
జబర్ధస్త్ షో కమెడియన్  హైపర్ ఆది మరోసారి బిగ్‌బాస్ రన్నరప్ శ్రీముఖి పై అదిరిపోయే పంచ్‌లు వేసాడు. ఈ ఆదివారం వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో అభిమానుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను నాగ చైతన్య సరసన కరెక్ట్‌గా సరిపోతానని నాగార్జున బిగ్‌బాస్ షోలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. అంతేకాదు తనకు తోడుగా నాగ చైతన్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యాంకరింగ్‌ చేస్తారని ప్రకటించింది. తీరా వేదికపైకి నాగ చైతన్యకు బదులుగా హైపర్ ఆది ప్రత్యక్షమయ్యాడు.నాగ చైతన్య వస్తాడనుకుంటే నువ్వు వచ్చావేమిటి అని శ్రీముఖి హైపర్ ఆదిని ప్రశ్నించింది. దానికి హైపర్ ఆది.. నాగార్జున నాకు ఫోన్ చేసి నన్ను యాంకరింగ్ చేయమని చెప్పాడనన్నారు. అంతేకాదుఈ వేడుకలో శ్రీముఖి ఉంటే స్పీకర్లు అవసరమా ? మీరు ఖమ్మంలోఇంట్లో పడుకున్న ఆమె మాట్లాడిన మాటలు మీకు వినపడతాయని చెప్పాడు. అంతేకాదు నాగుల చవతి రోజున పుట్ట పుట్టకుతిరిగి గుడ్లు ఏరుకు తినే నీకు నాగ చైతన్య అవసరమా అంటూ అదిరిపోయే పంచ్‌లు వేసాడు. అంతేకానీ.. నీకు బిగ్‌బాస్‌లో ఉండి నీకు మైండ్ పోయిందని కామెడీగా అన్నాడు. మొత్తానికి వీళ్లిద్దరి మధ్య జరిగిన  సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>