హోమ్ /వార్తలు /సినిమా /

Hyper Aadi: ప్రగతితో హైపర్ ఆది క్రేజీ డాన్స్.. ఇది ఊరమాస్ ట్రీట్! వీడియో వైరల్

Hyper Aadi: ప్రగతితో హైపర్ ఆది క్రేజీ డాన్స్.. ఇది ఊరమాస్ ట్రీట్! వీడియో వైరల్

Photo Twitter

Photo Twitter

Hyper Aadi Pragathi: మాటమాటకు పంచ్ వేస్తూ ఎదుటనున్నవాళ్లకు చుక్కలు చూపించే హైపర్ ఆది.. తన హుషారైన స్టెప్పులతో ఎన్నోసార్లు వేదికను దడలాడించారు. తాజాగా సీనియర్ నటి ప్రగతితో కలిసి మరింత రెచ్చిపోయాడు.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి ఎంత చెప్పినా తక్కువే. సందర్భానుసార పంచ్ డైలాగ్స్ విసరడంతో ఎంత దిట్టనో అమ్మాయి దొరికితే ఆమెతో రొమాంటిక్ స్టెప్స్ వేస్తూ హుషారెత్తించడంలోనూ అంతే దిట్ట హైపర్ ఆది. మాటమాటకు పంచ్ వేస్తూ ఎదుటనున్నవాళ్లకు చుక్కలు చూపించే ఆయన.. తన హుషారైన స్టెప్పులతో ఎన్నోసార్లు వేదికను దడలాడించారు. జబర్దస్త్ (Jabardasth) వేదికపై హైపర్ ఆది చేసిన డాన్స్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. యాంకర్ అనసూయ, యాంకర్ వర్షిణిలతో హైపర్ ఆది చేసిన హంగామా ఎలా ఉందో చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికీ ఈ డాన్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ సారి అంతకుమించి అన్నట్లుగా రెచ్చిపోయాడు హైపర్ ఆది. అదికూడా సీనియర్ యాక్టర్ ప్రగతితో (Pragathi).

ప్రగతి అనగానే ముందుగా గుర్తొచ్చేవి డాన్సింగ్ మూమెంట్స్, ఆ తర్వాత హాట్ వర్కవుట్స్. ఎన్నోసార్లు డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఘనత ప్రగతి సొంతం. చీరకట్టి, మోడ్రన్ డ్రెస్ వేసి ప్రగతి వేసే తీన్మార్ స్టెప్పులకు నెట్టింట యమ గిరాకీ. అలాంటి ఈ నటీమణి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో మాస్ స్టెప్పేస్తే ఎలా ఉంటుందో తాజా వీడియో ప్రూవ్ చేసింది.

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో (Sridevi Drama Company latest promo) విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగే హైపర్ ఆది, రాం ప్రసాద్ హంగామా కనిపించింది. ఇక ఆషాడ మాసం మీద ప్రోగ్రాం ప్లాన్ చేసి ఆషాడంలో అల్లుళ్లు అంటూ ఇరగదీసే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చారు. ఈ ప్రోగ్రాంకి స్పెషల్ గెస్టుగా విచ్చేసింది ప్రగతి. అయితే ముందుగా ప్రగతి వర్కవుట్ల సటైర్ల మీద సెటైర్లు వేసిన హైపర్ ఆది.. ఆ తర్వాత ఆమెతో ఊరమాస్ డాన్స్ చేసి కనువిందు చేశాడు. హైపర్ ఆదితో కలిసి స్టేజ్ మీదకు వచ్చి ఊర నాటు స్టెప్పులేసింది ప్రగతి.' isDesktop="true" id="1362194" youtubeid="86qTm9kA8Ws" category="movies">

కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు.. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్టా అనే పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకర్షించారు హైపర్ ఆది, ప్రగతి. ఈ జోడీ స్పీడు చూసి అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యారు. ఈలలతో గోల పెట్టేశారు. చీరకట్టి యమ హుషారుగా స్టెప్పులేస్తూ ఆశ్చర్యపరిచింది ప్రగతి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ కావడమే గాక రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. నెటిజన్లు పిచ్చెక్కిపోతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియో చూసేయండి మరి!!.

First published:

Tags: Actress pragathi, Hyper Aadi, Sridevi Drama Company Promo

ఉత్తమ కథలు