Home /News /movies /

HYPER AADI PLAN TO GIVE BIG SURPRISE GIFT TO VARSHINI HERE ARE THE DETAILS MK

Hyper aadi: యాంకర్ వర్షిణి కోసం ఖరీదైన గిఫ్ట్ సిద్ధం చేసిన హైపర్ ఆది...ఏంటో తెలిస్తే షాకే...

హైపర్ ఆది వర్షిణి (hyper aadi varshini)

హైపర్ ఆది వర్షిణి (hyper aadi varshini)

Hyper Aadi - Varshini: హైపర్ ఆది వైపు నుంచి మాత్రం కాస్త సిన్సియర్ గానే వర్షిణిని తన ట్రాక్ లో పడేయాలని ప్రయత్నిస్తున్నట్లు నెటిజన్లు గమనిస్తున్నారు.

    బుల్లితెరపై జంటలు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ గా మారాయి.  ముఖ్యంగా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ ఒక్కటి కాకపోతే అటు ఫ్యాన్స్ కూడా ఊరుకునే పరిస్థితి లేకుండా మారింది. అందుకు తగ్గట్టే వారిద్దరి కెమిస్ట్రీని మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా బాగా వాడేసుకుంది. అటు జబర్దస్త్ లో మాత్రమే కాదు, ఢీ షోలో కూడా వీరిద్దరినీ పర్మినెంట్ హోస్ట్ లుగా క్రియేట్ చేసింది. అంతేకాదు ఓ ఈవెంట్ లో పెళ్లి కూడా చేసింది. అయితే సుడిగాలి సుధీర్ బయట తనకు రష్మీకి మధ్య ఎలాంటి ప్రేమ లేదని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ పలుమార్లు సంజాయిషీ ఇచ్చాడు. అయినప్పటికీ, సుధీర్ రష్మీ మధ్య రొమాన్స్ లేదంటే మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అయితే వీరిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ఓ మోస్తారు కెమిస్ట్రీని హైపర్ ఆది, వర్షిణి కూడా క్రియేట్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీనే పండిస్తున్నారని, సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొదట్లో అంతగా లేకపోయినప్పటికీ, హైపర్ ఆది వైపు నుంచి మాత్రం కాస్త సిన్సియర్ గానే వర్షిణిని తన ట్రాక్ లో పడేయాలని ప్రయత్నిస్తున్నట్లు నెటిజన్లు గమనిస్తున్నారు. అయితే హైపర్ ఆది విషయంలో వర్షిణి మాత్రం కేవలం అడ్వాంటేజ్ తీసుకోవాలనే అనుకుంటుంది. కానీ అంత సిన్సియర్ గా ఉండటం లేదని అందరికీ తెలిసిందే.

    నిజానికి వర్షిణి మొదటి నుంచి మోడలింగ్ రంగం నుంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత యాంకర్ గా స్థిరపడింది. పెళ్లిగోల రెండు వెబ్ సిరీస్ లలో నటించిన వర్షిణికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఢీ షోలో వర్షిణి, హైపర్ ఆది ఇద్దరూ కలిసి పండిస్తన్న కెమిస్ట్రీ మాత్రం ఇప్పుడిప్పుడే మంచి మార్కులు సంపాదిస్తోంది.

    ఇక వర్షిణి విషయంలో హైపర్ ఆది అటు మీడియా హైప్ క తగ్గట్టుగానే, కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. వీలైనప్పుడల్లా తన ప్రేమను వర్షిణి ముందు వ్యక్తం చేసేందుకు హైపర్ ఆది అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడని అంటున్నారు. అయితే వర్షిణి మాత్రం ఇటీవల ఆలీతో సరదాగా షోలో తనకు ప్రేమ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదంటూ హైపర్ ఆది ముందే చెప్పేసింది. అయితే హైపర్ ఆది మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సిన్సియర్ గా ట్రై చేస్తూనే ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

    మరోవైపు ఇటీవల వర్షిణికి హైపర్ ఆది ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడని, ఈ విషయం తన సన్నిహితులకు సైతం చెప్పాడు. అందుకు వాళ్లు వద్దని వారించినప్పటికీ, హైపర్ ఆది మాత్రం వినలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. మరి ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ కు వర్షిణి యాక్సెప్ట్ చేస్తుందా అదా అనేది తేలాల్సి ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anchor varshini, Dhee Dance Reality Show, Hyper Aadi, Hyper Adi, Jabardasth comedy show

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు