Home /News /movies /

HYPER AADI MUCH DEPENDENT ON ANCHOR ANASUYA IN HIS JABARDASTH MK

యాంకర్ అనసూయనే నమ్ముకున్న హైపర్ ఆది...సడెన్‌గా అదే పరిస్థితి వస్తే..

అనసూయ,హైపర్ ఆది (ఫైల్ ఫోటోస్)

అనసూయ,హైపర్ ఆది (ఫైల్ ఫోటోస్)

ఆది మాత్రం అనసూయ లేకపోతే స్కిట్ చేయలేడేమో అన్న స్థాయికి వెళ్లిపోయాడనే టాక్ వినిపిస్తోంది. అయితే అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతున్నట్లు అభయం ఇచ్చింది.

    హైపర్ ఆది అంటే పంచుల వర్షం. స్కిట్ లో కంటెంట్ కన్నా పంచుల టైమింగునే ఎక్కువగా నమ్ముకోవడం ఆది అలవాటు. అదే అతడి బలం కూడా...తన స్కిట్ పేలడం కోసం అందరినీ వాడేస్తుంటాడు. ముఖ్యంగా యాంకర్ అనసూయను తన స్కిట్స్ లో బాగా వాడేయడం హైపర్ ఆదికి అలవాటే. తాజాగా జబర్దస్త్ ప్రోమోలో సైతం హైపర్ ఆది, అనసూయతో కలిసి ఖుషి సినిమాలోని నడుము సీన్ రీక్రియేట్ చేశాడు. ఇలా గతంలో సైతం ఆది, అనసూయను నమ్ముకునే తన స్కిట్స్ లో సాంగ్ లేదా పంచులతో కాలం గడిపేశాడు. అయితే సుడిగాలి సుధీర్ కూడా రష్మీని ఫోకస్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటాడు. అయితే స్క్రిప్ట్‌ను మొత్తం రష్మీ కోసం అన్నట్లు తయారు చేయడు. కానీ ఆది మాత్రం అనసూయ లేకపోతే స్కిట్ చేయలేడేమో అన్న స్థాయికి వెళ్లిపోయాడనే టాక్ వినిపిస్తోంది. అయితే అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతున్నట్లు అభయం ఇచ్చింది.

    అయితే భవిష్యత్తులో ఆమె జబర్దస్త్ ను వదిలేస్తే హైపర్ ఆది పరిస్థితి ఏంటి అనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. అయితే హైపర్ ఆది కేవలం పంచులు, అనసూయను మాత్రమే నమ్ముకోకుండా..కాస్త స్క్రిప్టు మీద కూడా శ్రద్ధ పెడితే బాగుంటుందని నెట్టింట కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anasuya Bharadwaj, Hyper Aadi, Jabardasth, Jabardasth comedy show

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు