Home /News /movies /

దొరబాబు దెబ్బకు జబర్దస్త్ నుంచి హైపర్ ఆది ఔట్...ఆమె కూడా ఓ కారణమేనా..?

దొరబాబు దెబ్బకు జబర్దస్త్ నుంచి హైపర్ ఆది ఔట్...ఆమె కూడా ఓ కారణమేనా..?

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

దొరబాబు దూరం అయితే స్కిట్స్ లో జీవం పోతుందనే ఆందోళనలో హైపర్ ఆది కూరుకుపోయినట్లు సమాచారం. అయితే జబర్దస్త్ లో జరుగుతున్న ఈ పరిణామాలతో హైపర్ ఆది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

    సెక్స్ రాకెట్ కుంభకోణంలో దొరబాబు దొరికిపోయాక, ప్రస్తుతం హైపర్ ఆది టీమ్ మనుగడ ప్రశ్నార్థకం అయ్యేలా మారింది. కొత్త ఎపిసోడ్స్ లో దొరబాబు లేకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే హైపర్ ఆదికి పెద్ద దెబ్బేఅని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్స్ అన్నీ కేరక్టర్ బేస్డ్ గా ఉంటాయి. కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న బాపతే కనిపిస్తుంది. అయితే హైపర్ ఆది స్కిట్స్ ను సగం బతికించేది.. రైజింగ్ రాజు, దొరబాబు పై వేసే పంచులే కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం దొరబాబు దూరం అయితే స్కిట్స్ లో జీవం పోతుందనే ఆందోళనలో హైపర్ ఆది కూరుకుపోయినట్లు సమాచారం. అయితే జబర్దస్త్ లో జరుగుతున్న ఈ పరిణామాలతో హైపర్ ఆది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే హైపర్ ఆది జబర్దస్త్ నుంచి దూరం అయినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలు, అలాగే ఢీ షోతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఈవెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌ నుంచి దూరంగా ఉండేందుకు హైపర్ ఆది మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే హైపర్ ఆది మరో యాంకర్ తో కలిసి కొత్త షో సైతం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Dorababu, Hyper Aadi, Jabardasth

    తదుపరి వార్తలు